ఎన్టీఆర్ తో మరో దర్శకుడు.. సెట్టయినట్లేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు.;

Update: 2025-06-22 04:00 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి "వార్ 2" సినిమాతో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఇకపోతే తెలుగు సినిమా పరంగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.

ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే దేవర 2, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా లైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ లైనప్ మధ్యనే ఇంకో క్రేజీ కాంబినేషన్ కూడా బజ్‌లోకి వచ్చి ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అదే కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా.

తాజాగా నెల్సన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత నాగవంశీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఈ హైప్‌కి బలాన్నిస్తోంది. మా డియరెస్ట్ నెల్సన్ దిలీప్ కుమార్ కి హ్యాపీ బర్త్ డే. అతి త్వరలోనే బిగ్ స్క్రీన్ ట్రీట్ మళ్లీ వెనక్కి రాబోతుంది అనే కామెంట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇది కచ్చితంగా ఎన్టీఆర్‌తో చేసే సినిమాకే సంకేతమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నెల్సన్ గతంలో విజయ్ తో "బీస్ట్", రజనీకాంత్ తో "జైలర్" వంటి భారీ ప్రాజెక్ట్స్‌ను తెరకెక్కించాడు. "జైలర్" మెగా బ్లాక్ బస్టర్ కావడంతో తమిళ ఇండస్ట్రీలో అతడికి మంచి మార్కెట్ ఏర్పడింది. అలాంటి నెల్సన్ ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో జతకడితే, అది అసలైన ఫైర్ కాంబో కానుంది. పైగా పాన్ ఇండియా రేంజ్‌లో సెట్ చేయదగిన కాంబినేషన్ ఇది కావడం విశేషం.

ఇప్పటికే ఎన్టీఆర్ లైనప్ చాలా బిజీగా ఉంది. కానీ పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ముందుగా ప్లాన్ చేసిన లైనప్‌లో కొన్ని మార్పులు జరగొచ్చని అంటున్నారు. ఎప్పుడు అయినా గ్రీన్ సిగ్నల్ వస్తే, నెల్సన్ – ఎన్టీఆర్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా భారీ మాస్ ఎంటర్టైనర్‌కి అవకాశం కల్పించనుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Tags:    

Similar News