డ్రాగన్ లో ట్విస్ట్ ఇవ్వబోతున్న బ్యూటీ?

టాలీవుడ్‌లో స్టార్ హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమా భారీ బజ్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-05-14 11:21 GMT

టాలీవుడ్‌లో స్టార్ హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమా భారీ బజ్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నాడని, ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని టాక్ నడుస్తోంది.

‘డ్రాగన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమా 1969లో బంగ్లాదేశ్‌లో తెలుగు వలసదారుల చుట్టూ సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోందని సమాచారం. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ సేవియర్ పాత్రలో కనిపించనున్నాడని, ఈ కథలో ఇమిగ్రేషన్ సమస్యలు, హీరోయిజంతో నిండి ఉంటుందని అంటున్నారు. ఈ టైటిల్, కథా నేపథ్యం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ఎంపికైంది. కన్నడ నటి అయిన రుక్మిణి ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె ఎన్టీఆర్ సరసన నటిస్తూ తన నటనతో అలరించనుందని టాక్. రుక్మిణి పాత్ర సినిమాకు ఎమోషనల్ డెప్త్‌ను జోడిస్తుందని, ఆమె నటన కథలో కీలకంగా ఉంటుందని సమాచారం.

ఇక లేటెస్ట్ గా ‘డ్రాగన్’ సినిమా గురించి మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమాలో స్పెషల్ రోల్‌లో కనిపించనుందని టాక్ నడుస్తోంది. రష్మిక ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ కాకపోయినా, కథలో చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తుందని సమాచారం. ఇది నిజమైతే, ఎన్టీఆర్‌తో రష్మిక తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

టాక్ ప్రకారం, రష్మిక పాత్ర కథలో ఊహించని టర్న్ తీసుకొస్తుందని అంటున్నారు. ఆమె క్యారెక్టర్ సినిమా స్టోరీలైన్‌లో యూ టర్న్ మూమెంట్‌గా ఉంటుందని, కథను మరో స్థాయికి తీసుకెళ్తుందని సమాచారం. రష్మిక పుష్ప 2, యానిమల్, ఛావా సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో, ఈ రోల్ ఆమె కెరీర్‌లో మరో రికార్డ్ గా కానుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Tags:    

Similar News