‘డ్రాగన్’లో నీల్ నెక్ట్స్ లెవెల్ ప్లాన్.. ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్!

ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక టీమ్ ముఖ్యమైన సీన్లు షూట్ చేస్తున్నారు.

Update: 2026-06-18 06:51 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్యాన్-ఇండియా మూవీ ‘డ్రాగన్’. ఇటీవలే ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన గ్లిమ్స్ సోషల్ మీడియాను ఎలా షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ న్యూస్ విన్న నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఆ విశేషాలు చూద్దాం..

శ్రీలంక కొండల్లో హై-ఓల్టేజ్ యాక్షన్:

ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక టీమ్ ముఖ్యమైన సీన్లు షూట్ చేస్తున్నారు. డ్రాగన్ తదుపరి భారీ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తం శ్రీలంకకు పయనం కానుంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో మనకు తెలుసు. ఇక శ్రీలంకలోని అద్భుతమైన, కనువిందు చేసే లొకేషన్లలో ఎన్టీఆర్‌పై కొన్ని మైండ్ బ్లాంక్ అయ్యే హై-ఓల్టేజ్ యాక్షన్ సీన్లను ప్లాన్ చేశారు నీల్. వచ్చే నెలలో ప్రారంభం కాబోయే ఈ భారీ షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన ఒక మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వబోతోందని సమాచారం.

రుక్మిణి వసంత్ హీరోయిన్.. అనిల్ కపూర్ విలన్?:

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కన్నడ క్రష్, బ్యూటిఫుల్ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ఎగర్‌గ్రీన్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ వర్సటైల్ యాక్టర్ బిజూ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ భారీ క్యాస్టింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది జూన్ 11న బాక్సాఫీస్ దండయాత్ర:

కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటెన్స్ నటనను ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో అని ట్రేడ్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ‘డ్రాగన్’ థియేటర్లలోకి వస్తే పాత రికార్డులన్నీ బద్దలు కావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.

ప్రశాంత్ నీల్ ప్లానింగ్, ఎన్టీఆర్ ఎనర్జీ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి. శ్రీలంక షెడ్యూల్‌తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం. ఇక వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కాబోతున్న ఈ 'డ్రాగన్' ఇండియన్ సినిమా హిస్టరీలో ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News