ఈ వారం బాక్సాఫీస్ విజేత ఎవ‌రో?

న‌వంబ‌ర్ 7న ప‌లు సినిమాలు రిలీజ్ కానుండ‌గా, అందులో ర‌ష్మిక మంద‌న్నా న‌టించిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్ పై అంద‌రూ ఇంట్రెస్ట్ గా ఉన్నారు.;

Update: 2025-11-05 10:32 GMT

గ‌త వారం టాలీవుడ్ లో బాక్సాఫీస్ చాలా డ్రై గా ఉంది. లాస్ట్ వీక్ బాహుబ‌లి ఎపిక్, మాస్ జాత‌ర సినిమాలు రిలీజ‌వ‌గా వాటిలో బాహుబ‌లి రీరిలీజ్ కు మిక్డ్స్ రెస్పాన్స్ రాగా, మాస్ జాత‌ర డిజాస్ట‌ర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి రాబోయే సినిమాల వైపుకి మ‌ళ్లింది. న‌వంబ‌ర్ 7న ప‌లు సినిమాలు రిలీజ్ కానుండ‌గా, అందులో ర‌ష్మిక మంద‌న్నా న‌టించిన ది గ‌ర్ల్‌ఫ్రెండ్ పై అంద‌రూ ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

జ‌టాధ‌ర స‌క్సెస్‌ పై మేక‌ర్స్ కాన్ఫిడెన్స్

ర‌ష్మిక మంద‌న్నా కు ఎక్కువ క్రేజ్ ఉండ‌టంతో పాటూ, ఈ సినిమాను డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీగా ప్ర‌మోట్ చేస్తుండ‌టంతో మంచి టాక్ వ‌స్తే ఈ సినిమా ఎక్కువ‌గా ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేసే వీలుంది. సుధీర్ బాబు న‌టించిన జ‌టాధ‌ర కూడా ఈ వార‌మే రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బ‌జ్ గొప్ప‌గా లేక‌పోయినా, రిలీజయ్యాక సినిమా మ్యాజిక్ చేస్తుంద‌ని, ఫాంట‌సీ జాన‌ర్ లో తెర‌కెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ త‌ర్వాత సూప‌ర్ సక్సెస్ అవుతుంద‌ని మేక‌ర్స్ ఎంతో ధీమాగా ఉన్నారు.

దాంతో పాటూ తిరువీర్ న‌టించిన ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేసేలానే ఉంది. ఆల్రెడీ రిలీజైన కంటెంట్ ఆడియ‌న్స్ ను మెప్పించడంతో ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో పై కూడా ఆడియ‌న్స్ కు మంచి ఆస‌క్తే ఉంది. రిలీజ్ త‌ర్వాత మంచి మౌత్ టాక్ వ‌స్తే సినిమాకు షోలు పెర‌గడంతో పాటూ స‌క్సెస్ అయ్యే అవ‌కాశాలు బాగానే క‌నిపిస్తున్నాయి. ఇక విష్ణు విశాల్ హీరోగా న‌టించిన కోలీవుడ్ డ‌బ్బింగ్ మూవీ ఆర్య‌న్ కూడా ఈ వార‌మే రిలీజ్ కానుండ‌గా, ఈ సినిమాకు బ‌జ్ క్రియేట్ చేయ‌డానికి విష్ణు విశాల్ తెలుగు ప్ర‌మోష‌న్స్ లో పాల్గొని మ‌రీ సినిమాపై హైప్ పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాక‌పోతే ఆర్య‌న్ డ‌బ్బింగ్ సినిమా కావ‌డంతో పాటూ ఆల్రెడీ ఆ సినిమా త‌మిళంలో గ‌త వారమే రిలీజై యావ‌రేజ్ రిజ‌ల్ట్ ను తెచ్చుకోవ‌డంతో ఈ మూవీపై భారీ హైప్ ఏర్ప‌డే ఛాన్స్ లేదు.

అవి కాకుండా ప్రేమిస్తున్నా, కృష్ణ లీల లాంటి చిన్న సినిమాలు కూడా ఈ వారమే త‌మ ల‌క్ ను టెస్ట్ చేసుకోవాల‌నుకుంటున్నాయి. బాలీవుడ్ యాక్ట‌ర్ ఇమ్రాన్ హ‌ష్మీ హాక్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. మ‌రి వీటన్నింటిలో ఏయే సినిమాలు ఆడియ‌న్స్ ను మెప్పించి బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ అవుతాయో చూడాలి. బ‌జ్ ప‌రంగా అయితే ఇప్ప‌టివ‌ర‌కు ర‌ష్మిక సినిమాకే ఎక్కువ హైప్ ఉండ‌గా, జ‌టాధ‌ర‌, ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా ఆడియ‌న్స్ లో ఆస‌క్తిని పెంచుతున్నాయి.

Tags:    

Similar News