• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాబు బర్త్ డేకు...

బాబు బర్త్ డేకు అదొక్కటేనా..?

| కానీ మూవీ నుంచి మహేష్ బర్త్ డేకి ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదంట.

By - Tupaki Desk
Update: 2023-07-27 13:26 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లాంగ్ గ్యాప్ లో ఈ మూవీ వస్తోంది. గత ఏడాది గుంటూరు కారం సినిమా స్టార్ట్ అయినా కూడా మొదటి వెర్షన్ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో మహేష్ బాబు షూటింగ్ ఆపేశారు. దీంతో త్రివిక్రమ్ మరల స్క్రిప్ట్ పై వర్క్ చేసి కంప్లీట్ గా కొత్త వెర్షన్ సిద్ధం చేశారు.

ఈ నేపథ్యంలో మొదటిగా హీరోయిన్ గా అనుకున్న పూజా హెగ్డేని మార్చేసి ఆమె స్థానం లోకి శ్రీలీల ని తీసుకొచ్చారు. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి గ్యాప్ లేకుండా కీలక ఎపిసోడ్స్ అన్ని షూట్ చేస్తున్నారు. అయితే సడెన్ గా మూవీ ఫస్ట్ చేస్తోన్న కెమెరామెన్ మారిపోయారు. దీంతో షూటింగ్ కి కొంత గ్యాప్ వచ్చింది. ఈ మూవీ మ్యూజిక్ పరంగా కూడా ఇంకా తమన్ నుంచి వచ్చిన ట్యూన్స్ కి మహేష్ సంతృప్తి చెందలేదంట.

దీంతో తమన్ ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు చిన్న గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. అయితే మారిన కథ ప్రకారం ఆ గ్లింప్స్ లో ఉన్న ఎపిసోడ్ సినిమా లో ఉండే ఛాన్స్ లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఆగష్టు 9న ఉంది. అయితే ఆ రోజు ఫ్యాన్స్ గుంటూరు కారం నుంచి టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

కానీ మూవీ నుంచి మహేష్ బర్త్ డేకి ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదంట. త్రివిక్రమ్ కూడా మూవీకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఒక వేళ ఏదైనా అవకాశం ఉంటే బర్త్ డే పోస్టర్ ఒకటి వదిలే ఛాన్స్ మాత్రమే ఉందంట. మొత్తానికి ఈ సినిమాకి వరుస అడ్డంకుల కారణంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజున గుంటూరు కారం నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయకుండా ఉండటం బెటర్ అనే మాట వినిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు సినిమా కూడా చాలా సార్లు వాయిదా పడి రిలీజ్ అయ్యింది. అలాగే ఖలేజా మూవీకూడా స్టార్ట్ చేసిన రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పుడు గుంటూరు కారం సినిమా కూడా వరుస ఆటంకాలతో వెనక్కి వెళ్ళిపోతుంది. ఆగష్టు 11న ముందు రిలీజ్ అన్నారు. అది కాస్త వచ్చే ఏడాది సంక్రాతికి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా వచ్చే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాల లో వినిపిస్తోన్న మాట.

Tags:    
  • Gunturkaram 
  • Gunturkarammovie 
  • Gunturkaramfilm 
  • Maheshbabu 
  • Trivikram 
  • Sreeleela 
  • Birthdayupdate 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS