స్టేడియంను హోరెత్తించిన ఇండియ‌న్ హాట్ స‌రైన్!

కెనడా టొరంటో నగరంలో గ‌ల ప్రముఖ స్టేడియంలో జరిగిన మెగా టోర్నమెంట్ ప్రారంభ వేడుకలు ప్రేక్షకులను కనువిందు చేశాయి.

Update: 2026-06-13 08:29 GMT

క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా ప్రపంచకప్- 2026 సంబరాలు ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. కెనడా టొరంటో నగరంలో గ‌ల ప్రముఖ స్టేడియంలో జరిగిన మెగా టోర్నమెంట్ ప్రారంభ వేడుకలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. ఈ వేడుక‌లో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి అద్భుత నృత్య ప్రదర్శనతో స్టేడియంను హోరెత్తించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానుల సమక్షంలో అమ్మ‌డి లైవ్ పెర్ఫార్మెన్స్ వేడుక‌కే హైలైట్‌గా నిలిచింది.

కెనెడియన్ మూలాలున్న నోరా ఫతేహికి అక్క‌డ ప్రదర్శన ఇవ్వడం ఎంతో భావోద్వేగమైన అనుభవంగా మారింద నొచ్చు. స్వస్థలమైన కెనడా గడ్డపై ఇలాంటి ప్రతిష్టాత్మకమైన క్రీడా వేదికపై ప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశం రావడం పట్ల అమ్మ‌డు ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్టేడియంలోకి నోరా అడుగుపెట్టగానే వేలాది మంది అభిమా నులు పెద్ద ఎత్తున కేకలు.. చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఇది నోరా ప‌టేహీ అంతర్జాతీయ స్థాయి క్రేజ్‌ను మరోసారి రుజువు చేసింది.

ఈ మెగా ఈవెంట్ కోసం నోరా ఫతేహి పాపులర్ గ్లోబల్ హిట్స్ , ఫిఫా అధికారిక సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. నోరా ప‌టేహీ నృత్యంలో ఉన్న వేగం, గ్రేస్ , స్టేజ్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. రంగురంగుల లైటింగ్, వందలాది మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు , అత్యాధునిక సౌండ్ సిస్టమ్ నడుమ సాగిన అమ్మ‌డి ప్రదర్శన స్టేడియంలో సరికొత్త జోష్‌ను నింపింది. ఫుట్‌బాల్ క్రీడాకారులతో పాటు విదేశీ ప్రేక్షకులు సైతం నోరా డ్యాన్స్ మూమెంట్స్‌కు ఫిదా అయిపోయారు.

సామాజిక మాధ్య‌మాల్లో వేడుకను చూసిన నెటిజన్లు నోరాపై ప్రశంసల జ‌ల్లు కురిపిస్తున్నారు. అంత ర్జాతీయ వేదికలపై భారతీయ వినోద రంగానికి , బాలీవుడ్ డ్యాన్స్ శైలికి ఆమె తెస్తున్న‌ గుర్తింపును పలువురు అభినం దిస్తున్నారు. గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన నోరా ఫతేహి క్రీడలు సంగీతాన్ని తన నృత్యంతో ముడిపెట్టి ప్రపంచ ప్రేక్షకులను ఏకం చేసిందని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

2022 ఖతార్ ఫిఫా ప్రపంచకప్‌లోనూ నోరా ఫతేహి అధికారిక గీతంలో భాగస్వామి కావడమే కాకుండా ఫ్యాన్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి ఏకంగా టోర్నమెంట్ అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒక కళాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో వరుసగా ఫిఫా ఈవెంట్లలో భాగం కావడం నోరా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది.

Tags:    

Similar News