43 ఏళ్లలో కూడా స్టిల్ గ్లామర్.. ఆకట్టుకుంటున్న కొత్త మూవీ పోస్టర్!

అలా ఇప్పుడు తాజాగా ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించిన నాన్ వైలెన్స్ అనే మూవీతో మన ముందుకు రాబోతోంది.;

Update: 2025-11-12 16:15 GMT

కొంతమంది హీరోయిన్స్ వయసు పెరిగినా కూడా వన్నె తరగని అందంతో కుర్ర హీరోయిన్ ల లాగే మెరిసిపోతూ ఉంటారు. అలాంటి వారిలో శ్రియా శరణ్ కూడా ఒకరు.. 43 ఏళ్ల వయసున్న శ్రియా శరణ్ ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తోంది. అయితే తాజాగా శ్రియాకి కొత్త సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ మొత్తాన్నీ షేక్ చేస్తోంది. ఈ మేరకు శ్రియా శరణ్ కి సంబంధించిన కొత్త పాట పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్లో శ్రియా అందం చూసి చాలామంది షాక్ అయిపోతున్నారు. వామ్మో 43 ఇయర్స్ లో కూడా మరీ ఇంత గ్లామర్ ఏంటిరా బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


 


శ్రియాకి సంబంధించిన ఈ తాజా పోస్టర్లో పింక్ కలర్ మెరిసే దుస్తులను ధరించి ఒక బోల్డ్ ఫోజ్ పెట్టి స్టిల్ ఇచ్చింది. ఈ పోస్టర్ తో మళ్ళీ శ్రియా సినిమాల్లో తన గ్లామర్ తో కుర్రకారుని ఊర్రూతలూగించడానికి సిద్ధమైపోయిందని అనిపిస్తోంది. శ్రియా శరన్ నటిస్తున్న తాజా మూవీ నాన్ వైలెన్స్ నుండి పోస్టర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో ప్రస్తుతం శ్రియా శరన్ కి సంబంధించిన తాజా పోస్టర్ పై చాలా మంది నెటిజన్స్ వైరల్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక శ్రియా చివరిసారిగా మిరాయ్ మూవీలో తేజ సజ్జా తల్లి పాత్రలో నటించడంతో పాటు తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. అయితే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ద్వారా శ్రియా శరన్ కి ఎలాంటి గుర్తింపు కూడా రాలేదు. కానీ ఆమె అభిమానులు మాత్రం శ్రియా మళ్లీ కచ్చితంగా ఏదో ఒక కొత్త సినిమాతో తిరిగి వస్తుందని అనుకున్నారు. అలా ఇప్పుడు తాజాగా ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించిన నాన్ వైలెన్స్ అనే మూవీతో మన ముందుకు రాబోతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ రేపు ఉదయం 11 గంటలకు విడుదల కాబోతోంది.

అయితే తాజాగా వైబ్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ టీ సిరీస్ ఈ పోస్టర్ ని షేర్ చేసింది. ప్రకాశవంతమైన లైట్లు, డాన్సర్ల మధ్య శ్రీయ తన మిరుమిట్లు గొలిపే అందంతో మరింత యంగ్ గా కనిపిస్తోంది.. సరికొత్త ఐటమ్ సాంగ్ ఎంతో శ్రియ మరోసారి తన అభిమానులని అలరించబోతోంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు సినిమాల్లో అవకాశాలు తగ్గాక స్పెషల్ సాంగ్ లని ఎంచుకుంటున్నారు. అలా శ్రియా కూడా స్పెషల్ సాంగ్ ల వైపు అడుగు వేసినట్టు అర్థమవుతుంది. ఇక తాజాగా శ్రియా శరణ్ కి సంబంధించిన ఈ స్పైసీ పోస్టర్ ని బట్టి చూస్తే మాత్రం శ్రియా కచ్చితంగా కం బ్యాక్ ఇస్తుందని ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News