సంప్రదాయ దుస్తుల్లో నివేదా థామస్ మెస్మరైజ్.. ఫ్యాన్స్ ఫిదా!
న్యాచురల్ యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి నివేదా థామస్, తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలతో నెటిజన్ల మనసులను దోచేస్తోంది.
న్యాచురల్ యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి నివేదా థామస్, తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలతో నెటిజన్ల మనసులను దోచేస్తోంది. పండుగ పూట కేరళ సంప్రదాయ దుస్తుల్లో రాకుమారిలా మెరిసిపోతూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ఏ దుస్తులు వేసినా తనదైన శైలిలో కనిపించే ఈ భామ, ఈ కొత్త లుక్‌లో చూపు తిప్పుకోనివ్వని అందంతో అలరిస్తోంది. ప్రస్తుతం నివేదా షేర్ చేసిన ఈ లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కేరళ చీరలో హోమ్లీ లుక్:
ఓణం పండుగ సందర్భంగా నివేదా థామస్ క్లాసిక్ ఐవరీ కలర్ కేరళ కసవు చేనేత చీరను ఎంచుకుంది. చీర అంచులకు ఉన్న గోల్డెన్ జరీ బోర్డర్ ఆమెకు మరింత పద్ధతిగల లుక్‌ను తెచ్చిపెట్టింది. ఇక సాంప్రదాయమైన ఈ చీరకట్టులో నివేదా చాలా సింపుల్‌గా, అంతే ఎలిగెంట్‌గా కనిపిస్తూ కేరళ కుట్టిలా అలరించింది.
స్లీవ్‌లెస్ బ్లౌజ్ అండ్ మినిమల్ యాక్సెసరీస్:
ఈ వైట్ కసవు చీరకి కాంబినేషన్‌గా నివేదా వేసుకున్న మెరూన్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి ఆర్భాటం లేకుండా చేతికి చిన్న గోల్డ్ వాచ్, చెవులకు మ్యాచింగ్ కమ్మలతో చాలా సింపుల్‌గా స్టైలింగ్ చేసుకుంది. ఇక ఈ మినిమలిస్ట్ లుక్ ఆమె సహజమైన అందాన్ని మరింత రెట్టింపు చేసి చూపించింది.
క్యూట్ క్యాప్షన్‌తో ఓణం సందడి:
ఫోటోలతో పాటు నివేదా రాసుకొచ్చిన క్యాప్షన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. "కేరళ ప్రయాణం తర్వాత పాయసంతో ఓణం వేడుకలు మొదలయ్యాయి. ఇక ఆ తర్వాత కడుపు నిండా సద్య విందు, సరదా ఆటలు ఆడేశాం. నవ్వుకోవడం కూడా వర్కౌట్ అనుకుంటే మా అందరికీ ప్యాక్స్ వచ్చేసేవి. తిని కదల్లేని స్థితిలో కార్ ట్రంక్‌లో కూర్చున్నాను" అంటూ కుటుంబంతో గడిపిన సరదా క్షణాలను పంచుకుని శుభాకాంక్షలు తెలిపింది.
కామెంట్ల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్:
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో నివేదాపై ప్రేమను కురిపిస్తున్నారు. "సూపర్", "బ్యూటిఫుల్", "చాలా క్యూట్‌గా ఉన్నావు" అంటూ పొగడ్తలతో కామెంట్ బాక్స్‌ను నింపేస్తున్నారు. ఇక సాంప్రదాయాన్ని, మోడర్న్ టచ్‌ను సమన్వయం చేస్తూ నివేదా డ్రెస్సింగ్ చేసుకునే తీరు ఫ్యాషన్ ప్రేమికులకు కొత్త ఇన్సిపిరేషన్‌గా నిలుస్తోంది.
వెండితెరపై నటనతోనే కాకుండా, బయట తన సింప్లిసిటీతో అందరి మనసులను గెలుచుకునే నివేదా థామస్, ఈ ఓణం ఫోటోలతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ క్వీన్‌గా మారిపోయింది.