నివేదా పేతురాజు జీవితంలో ఊహించ‌ని ప్ర‌యాణం!

కొంద‌రు జీవితాల్లో ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. కొంత మంది క‌ల‌లు క‌న్నా? క‌ష్ట‌ప‌డినా సాధ్యం కానివి కొంద‌రికీ ఎలాంటి క‌ష్టం...శ్ర‌మ లేకుండా ల‌క్కీగా ఊహించ‌ని రేంజ్ కు చేరుకుంటారు.

Update: 2026-06-16 04:12 GMT

కొంద‌రు జీవితాల్లో ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. కొంత మంది క‌ల‌లు క‌న్నా? క‌ష్ట‌ప‌డినా సాధ్యం కానివి కొంద‌రికీ ఎలాంటి క‌ష్టం...శ్ర‌మ లేకుండా ల‌క్కీగా ఊహించ‌ని రేంజ్ కు చేరుకుంటారు. నటి నివేదా పేతురాజ్ కెరీర్ .. జీవిత గమనంపై చేసిన వ్యాఖ్యలు తాజాగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జీవితం తనను తాను అస్సలు ఊహించని స్థానాలకు .. సరికొత్త రంగాలకు తీసుకెళ్లిందని పేర్కొనడం విశేషం. దుబాయ్‌లో మోడలింగ్ రంగం నుండి చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నివేదా పేతురాజ్ తొలుత `మెంటల్ మదిలో`, `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా` , `అల వైకుంఠపురములో` వంటి విజయవంతమైన చిత్రాల తో తెలుగు, తమిళ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే తాను ఎప్పుడూ పూర్తి స్థాయి నటిగా స్థిరపడతానని భావించలేదని, అనుకోకుండా జరిగిన పరిణామాల వల్లే వెండితెరకు పరిచయమయ్యానని వెల్లడించారు. గ్లామర్ ప్రపంచం వెలుపల త‌న‌కున్న‌ ప్రత్యేకమైన ఆసక్తులు అమ్మ‌డిని ఇతరుల కంటే భిన్నంగా నిలబెట్టాయన్న‌ది కాద‌న‌లేని నిజం. రంగుల ప్రపంచానికి దూరంగా నివేదా పేతురాజ్‌కు మోటార్ స్పోర్ట్స్ - కార్ రేసింగ్ అంటే ఎంతో మక్కువ. ప్రొఫెషనల్ రేసింగ్‌లో అధికారికంగా శిక్షణ పొంది సర్టిఫైడ్ రేసర్‌గా కూడా మారింది. అగ్ర నటిగా అవకాశాలు వస్తున్న సమయంలోనే ఇలాంటి కఠినమైన, సాహసోపేతమైన రంగాన్ని ఎంచుకోవడం అందులో రాణించడం నివేద‌ వ్యక్తిత్వంలోని అంతులేని ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.

కెరీర్ ఎదుగుదలపై అమ్మ‌డు చేసిన వ్యాఖ్య‌లు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసినా? అందులోని లోతైన అర్థాన్ని అంతా స్వాగతిస్తున్నారు. వృత్తిపరమైన జీవితంలో అనుకున్న ప్రణాళికల కంటే జీవితం కల్పించే అవకాశాలు , మలుపులే సరైన మార్గంలో నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు. కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా.. కొత్త సవాళ్లను స్వీకరించడమే తనకు ఎక్కువ మానసిక తృప్తిని ఇస్తుందని తెలిపింది.

ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన వ్యక్తిగత ఆశయాలకు .. అభిరుచులకు సమాన ప్రాధాన్యతనిచ్చే నివేదా నిర్ణయాన్ని నెటిజన్లు, అభిమానులు ఎంతో అభినందిస్తున్నారు. సాంప్రదాయక కెరీర్ బాటలోనే పయనించకుండా త‌న‌కు నచ్చిన పనులను ధైర్యంగా ఎంచుకోవాలనే నివేద‌ ఆలోచనా విధానం నేటి యువతకు..మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని సామాజిక మాధ్యమాలలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

కెరీర్ లో వచ్చే విజయాలు, అవకాశాల కంటే ఒక వ్యక్తిగా లభించే మానసిక ప్రశాంతత .. సంతోషమే ముఖ్యమని నివేదా పేతురాజ్ నిరూపిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి సరికొత్త మార్గాలను ఎంచుకున్నప్పటికీ ఒక నటిగా .. స్వతంత్ర వ్యక్తిగా సాధించిన గుర్తింపు ప్రత్యేకమైనది. జీవితంలో ఊహించని మలుపులను భయపడకుండా? ధైర్యంగా స్వాగతించడమే అసలైన జీవన శైలి అని నివేద‌ ప్రయాణం గుర్తుచేస్తోంది.

Tags:    

Similar News