ర‌త‌న్ టాటాలా ఫీల‌వుతోన్న నిత్యామీన‌న్!

తాజాగా ఇలాంటి అభిప్రాయాన్నే పంచుకుంది న‌టి నిత్యామీన‌న్. ప్రేమ‌కు ఇప్పుడు త‌న జీవితంలో పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదంది.;

Update: 2025-08-28 12:30 GMT

దివంగ‌త పారిశ్రామిక దిగ్గ‌జం ర‌త‌న్ టాటా వ్య‌క్తిగ‌త జీవితం ఎంతో నిరాడంబ‌రమైంది. జీవితాంతం ఒంట‌రిగానే బ్ర‌తికారు. త‌ల్లిదండ్రులు విడిపోవ‌డం స‌హా  ఆయ‌న ప్రేమ కూడా విక‌టించ‌డంతో అవివాహితుడిగానే ఉండిపోయారు. ఆయ‌న పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి గ‌ల ప్ర‌ధాన కార‌ణాలుగా వీటినే హైలైట్ చేసారు. ఒక్కోసారి ఒంట‌రి జీవితం బాధ‌గా అనిపించినా చాలా సంద‌ర్భాల్లో ఇదే ఉత్త‌మ‌మైన జీవితం గానూ ఆయ‌న భావించారు. బంధాలు...బంధావ్యాలు ఏర్ప‌రుచుకుని ఓ రోజు వాటిని ఆక‌స్మాతుగా వ‌దిలేసి వెళ్లిపోవ‌డం కంటే? సింగిల్ గా ఉండ‌టానే తానేంతో ఆస్వాదిస్తాన‌ని చెప్పారు.

తాజాగా ఇలాంటి అభిప్రాయాన్నే పంచుకుంది న‌టి నిత్యామీన‌న్. ప్రేమ‌కు ఇప్పుడు త‌న జీవితంలో పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదంది. మ‌రో ర‌కంగా కూడా జీవితాన్ని ఆస్వాదించ‌డం అల‌వాటు చేసుకు న్న‌ట్లు తెలిపింది. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్ర‌మే. సింగిల్ గా ఉండ‌టంలో త‌ప్పేముంది? ర‌త‌న్ టాటా కూడా సింగిల్ గానే ఉన్నారు. ఆయ‌న జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల్ని ఆయ‌న్ని అలా మార్చి ఉండొచ్చు. కానీ ఏదో ఒక ద‌శ‌లో ఆయ‌న‌కు కూడా వ్య‌క్త‌గ‌తంగా పెళ్లిపై ఆస‌క్తి లేక‌పోయి ఉండొచ్చు.

తోడు లేను బాధ అప్పుడ‌ప్పుడు క‌లిగినా? స్వేచ్ఛ‌గా ఉన్నంద‌కు మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదే భ‌ర్త‌, పిల్లు అనే బంధం ఏర్ప‌రుచుకుంటే ఆ జీవితం వేరుగా ఉంటుంద‌న్నారు. స్వేచ్ఛ‌కు దూరంగా ఉండేదాన్ని అన్నారు. గ‌తంలో లివ్ ఇన్ రిలేష‌న్ షిప్ గురించి నిత్యామీన‌న్ త‌న అభిప్రాయాన్ని ఓపెన్ గా పంచుకుంది. పెళ్లి చేసుకోవ‌డం కంటే న‌చ్చిన వాడితో కొన్నాళ్ల పాటు, క‌లిసి ఉండి ఒక‌ర్నిఒక‌రు అర్దం చేసుకోవ‌డం ఎంతో ఉత్త‌మ‌మైంది అన్నారు. పెద్ద‌ల వివాహం కంటే ప్రేమ వివాహ‌మే బ‌లంగా ఉంటుంద‌ని అభిప్రాయ ప‌డింది.

తాను పెళ్లి చేసుకున్నా? ప్రేమించిన త‌ర్వాత కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం అనంత‌ర‌మే వివాహం చేసుకుం టాన‌ని తెలిపింది. కానీ అమ్మ‌డిప్పుడు స్వ‌రం మార్చేసింది. నిత్యా మీన‌న్ వ‌య‌సు 37 ఏళ్లు. గ‌తంలో ఓ న‌టుడితో డేటింగ్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది. కానీ వాటిపై నిత్యామీన‌న్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వ లేదు. ప్ర‌స్త‌తుం న‌టిగా ఆమె ప్ర‌యాణం సాపీగా సాగుతోంది. త‌మిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది.

Tags:    

Similar News