నితిన్ నుంచి మరో కథ చేజారిందా?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పరిస్థితేమీ ఇప్పుడు బాలేదు. గత కొన్ని సినిమాలుగా నితిన్ వరుస ఫ్లాపుల్లోనే ఉన్నారు.;
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పరిస్థితేమీ ఇప్పుడు బాలేదు. గత కొన్ని సినిమాలుగా నితిన్ వరుస ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ సినిమా అయినా వర్కవుట్ అవుతుందని చేయడం, ఆ సినిమా అతన్ని, అతని ఫ్యాన్స్ ను నిరాశపరచడం.. ఇదే జరుగుతూ వస్తుంది తప్పించి నితిన్ కు హిట్ వచ్చి చాలా కాలమైంది. భీష్మ తర్వాత నితిన్ కెరీర్లో సరైన సక్సెస్ అనేది రాలేదు.
కనీస ఓపెనింగ్ దక్కించుకోలేని తమ్ముడు
అందుకే నితిన్ ఎలాంటి కథతో వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఆడియన్స్ కూడా రెడీగా లేరు. వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు సినిమాకైతే కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. దీంతో నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. తమ్ముడు సినిమా తర్వాత రీసెంట్ గానే వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రీసెంట్ గానే దాన్ని పట్టాలెక్కించారు నితిన్.
వి.ఐ ఆనంద్ తో సినిమా చేస్తున్న నితిన్
వి.ఐ ఆనంద్ సినిమా తప్పించి నితిన్ చేతిలో ఇప్పుడు మరో ప్రాజెక్టు లేదు. వాస్తవానికి నితిన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని అతని వద్దకు వెళ్లిన కొన్ని కథలు కూడా ఇప్పుడు అతన్నుంచి వేరే హీరోల దగ్గరకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది.