ఈ క్ష‌ణం కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నాను.. నితీష్ తివారీ ఎమోష‌న‌ల్

''సినిమా నిర్మాణం అనేది చాలా ఊహాజనితమైన.. ఏకాంతంతో కూడిన ప్రక్రియ'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు నితీష్ తివారీ.;

Update: 2026-04-02 19:13 GMT

''సినిమా నిర్మాణం అనేది చాలా ఊహాజనితమైన.. ఏకాంతంతో కూడిన ప్రక్రియ'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు నితీష్ తివారీ. ఇప్పుడు రామాయ‌ణం టీజ‌ర్ కి వ‌స్తున్న స్పంద‌న చూసాక ఆ క‌ష్టం అంతా మాయ‌మైంద‌ని ఆనందం వ్య‌క్తం చేసారు.

నితీష్ తివారీ దంగ‌ల్ మేకింగ్ కోసం సుదీర్ఘ స‌మ‌యం తీసుకున్నారు. కానీ ఆ చిత్రం ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. భార‌త‌దేశంలో ఫైనెస్ట్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా నిల‌బెట్టింది ఈ చిత్రం. దంగ‌ల్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద 2200కోట్లు వ‌సూలు చేసింది. ముఖ్యంగా చైనాలోను 1400 కోట్లు వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు రామాయ‌ణం టార్గెట్ అత్యంత భారీగా ఉంది..

ఈ స‌మ‌యంలో నితేష్ తివారీ ఎమోషనల్ స్పీచ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్న `రామాయణ` ఫస్ట్ గ్లింప్స్ విడుదల సందర్భంగా దర్శకుడు నితేష్ తివారీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రణబీర్ కపూర్‌ను శ్రీరాముడిగా పరిచయం చేస్తూ విడుదలైన ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా నితేష్ తివారీ మాట్లాడుతూ.. ఈ ఒక్క క్షణం కోసం తాను గత ఏడేళ్లుగా నిరీక్షిస్తున్నానని, ఈ సుదీర్ఘ ప్రయాణంలో పడిన కష్టం ఇప్పుడు టీజర్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే మాయమైపోయిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఫిలింమేకింగ్ గురించి నితేష్ తివారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. సినిమా నిర్మాణం అనేది చాలా ఊహాజనితమైనదని.. ఇది ఒక `ఏకాంత ప్రక్రియ` అని ఆయన సంచలన వ్యాఖ్యానించారు. ఏడేళ్ల పాటు ప్రతి క్షణం ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ.. ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో అని తపించానని.. ఈ ఏకాంత పోరాటంలో వచ్చిన ఫలితం నేడు తన కళ్ల ముందు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. గతంలో `దంగల్` వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ (రూ. 2200 కోట్ల వసూళ్లు) అందించిన దర్శకుడు కావడంతో `రామాయణం`పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

రామాయణంలోని గొప్పతనం దాని భావోద్వేగ సాంద్రతలో ఉందని నితేష్ తివారీ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం మంచి- చెడు మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదని.. సరైన పనిని చేయడం కోసం పడే తపన, తీసుకునే నిర్ణయాలు.. వాటి పరిణామాల చుట్టూ తిరిగే కథ అని వివరించారు. రాముడి ప్రయాణాన్ని అత్యంత మానవీయ కోణంలో యథార్థతను దెబ్బతీయకుండా తెరపైకి తీసుకురావడమే తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ చిత్రంలో ఎమోషనల్ రిచ్‌నెస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ భారీ ప్రాజెక్టును రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఇందులో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ , లక్ష్మణుడిగా రవి దూబే వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. భారతీయ కథా సంప్రదాయాలకు అంతర్జాతీయ స్థాయి మేకింగ్ నైపుణ్యాన్ని జోడిస్తూ డిఎన్ఇజి సంస్థ‌ సహకారంతో ఈ విజువల్ వండర్‌ను తీర్చిదిద్దుతున్నారు.

మరో విశేషమేమిటంటే.. ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు హ్యాన్స్ జిమ్మర్ మరియు ఏ.ఆర్. రెహమాన్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ - మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్ప‌నుంది. `దంగల్`తో చైనా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నితేష్ తివారీ ఇప్పుడు `రామాయణ`తో అంతకంటే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ ఆధ్యాత్మిక గాథను వెండితెరపై ఆవిష్కరించడం ద్వారా తరతరాలకు స్ఫూర్తిని అందించడమే తమ లక్ష్యమని దర్శకుడు తెలిపారు.



Full View


Tags:    

Similar News