• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2025 సమ్మర్ కి నిఖిల్...

2025 సమ్మర్ కి నిఖిల్ ఖర్చీఫ్..!

| నిఖిల్ స్వయంభు సినిమా ఈ ఇయర్ వదిలేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

By - Tupaki Desk
Update: 2024-05-31 14:30 GMT

కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత రెండు సినిమాలు చేయగా వాటితో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. 18 పేజెస్ సినిమా కాస్త పర్వాలేదని అనిపించినా దాని వల్ల నిఖిల్ కి అంత గొప్ప పేరు రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రాబోతున్నాయి. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా స్వయంభు. భువన్ సాగర్ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది. సినిమాలో నిఖిల్ సరసన మలయాళ భామ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటివరకు సంయుక్త చేసిన సినిమాలు అన్ని దాదాపు సక్సెస్ అయ్యాయి. డెవిల్ ఒక్కటి నిరాశపరచింది. ఐతే స్వయంభు సినిమాతో సం యుక్త కూడా తన సత్తా చాటబోతుందని అంటున్నారు. నిఖిల్ స్వయంభు సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా మిగతా పార్ట్ షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే అసలైతే సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ చేయాలని అనుకున్నా ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తుంది.

నిఖిల్ స్వయంభు సినిమా ఈ ఇయర్ వదిలేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈసారి సమ్మర్ స్టార్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేయగా ఏది అనుకున్న టైం కు రాలేదు. 2024 సమ్మర్ స్టార్ సినిమాలు లేక చప్పగా సాగిందని చెప్పాలి. అయితే 2025 లో మాత్రం వరుస స్టార్ సినిమాలు టార్గెట్ చేస్తున్నారు. అయితే వారితో తను పోటీకి సిద్ధం అంటున్నాడు నిఖిల్.

స్వయంభు తో పాటుగా నిఖిల్ చరణ్ నిర్మాణంలో ది ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య వస్తుంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ చేస్తున్న ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేసులో ఉండనున్నాయి. మరి నిఖిల్ అనుకున్న విధంగా ఈ సినిమాలతో టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి. నిఖిల్ స్వయంభు, ది ఇండియా హౌస్ రెండు సినిమాల మీద ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఉంది. మరి అందుకు తగినట్టుగానే సినిమాలు ఉంటాయా లేదా అన్నది చూడాలి. ఈ రెండిటితో పాటు తర్వాత నిఖిల్ చేసే సినిమాలు కూడా నేషనల్ వైడ్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే చేయాలనే ఆలోచనతో ఉన్నాడు నిఖిల్. సో మన టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ లో నిఖిల్ కూడా తన మార్క్ తో దూసుకెళ్లాలని చూస్తున్నాడని చెప్పొచ్చు.

Tags:    
  • NikhilSiddharth 
  • Swayambhu 
  • Panindianmovie 
  • Karthikeya2 
  • Bhuvansagar 
  • Perodicalmovie 
  • Theindiahouse 
  • Nabhanatesh 
  • Tollywood 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS