రక్షాబంధన్ వేళ నిహారిక స్పెషల్ విషెస్.. ఆకట్టుకుంటున్న క్యాప్షన్!

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓవైపు హీరోయిన్ గా.. మరోవైపు నిర్మాతగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-08-09 08:31 GMT

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓవైపు హీరోయిన్ గా.. మరోవైపు నిర్మాతగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా రాఖీ పండుగ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. రాఖీ పండగ అనగానే నిహారికకు చాలా స్పెషల్.. అలాంటి నిహారిక తన అన్నలతో రాఖీ పండుగ ఎలా సెలెబ్రేట్ చేసుకుంది? తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఆ స్పెషల్ పోస్ట్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మెగా ఫ్యామిలీ నుండి కూతుర్లు ఇండస్ట్రీలోకి రారు అనే ఓ టాక్ అప్పట్లో ఉండేది. కానీ నిహారిక ఆ రూమర్లకి చెక్ పెట్టి ఇండస్ట్రీలోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.. అలా పలు షోలు చేసిన నిహారిక ఆ తర్వాత నాగశౌర్యతో కలిసి 'ఒక మనసు' అనే సినిమా చేసి హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న తరుణంలోనే జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. కానీ వైవాహిక బంధంలో కొనసాగలేక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయ్యాక హీరోయిన్ గా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించి నిర్మాతగా మారిపోయింది. ఇటు భర్తకు విడాకులు ఇచ్చాక నిర్మాతగానే కాదు మళ్లీ హీరోయిన్ గా కూడా రీఎంట్రీ ఇచ్చేసింది.

అటు తమిళంలో నిహారిక నటించిన మద్రాస్ కారన్ మూవీలో ఎంత బోల్డ్ గా చేసిందో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి నిహారిక కొణిదెల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇక అందులో ఏముందంటే..ఈరోజు రాఖీ పండుగ కాబట్టి తన ఇద్దరు అన్నలతో ఉన్న ఫోటోలను పంచుకుంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరితో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే కాదు.. ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా జత చేసింది. "నాకు ఈ రాఖీ పండగ కొంచెం ఎక్కువ ప్రేమని అందించింది.." అని చెబుతూ వరుణ్ కొణిదెల, ఆల్ వేస్ రామ్ చరణ్ పేర్లతో ఉన్న ఇంస్టాగ్రామ్ ఐడి లను ట్యాగ్ చేస్తూ.." మీ చెల్లి అయినందుకు చాలా గర్వంగా ఉంది" అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం నిహారిక కొణిదెల తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఈ పోస్ట్ అందర్నీ ఆకర్షిస్తోంది.

నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు మూవీ నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయిపోయింది. ప్రస్తుతం నిహారిక మంచు మనోజ్ తో కలిసి వాట్ ది ఫిష్ అనే మూవీలో నటిస్తోంది. అలాగే నిహారిక మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ , నయన్ సారికలు నటిస్తున్న సినిమాని కూడా నిర్మిస్తోంది. ఫాంటసీ కామెడీ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాకి రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

Tags:    

Similar News