'రాకాస' క్యాచీ సాంగ్.. నిహారిక స్నేక్ డ్యాన్స్ ఫుల్ ట్రెండింగ్..

టాలీవుడ్‌ లో కొత్త తరహా హారర్ కామెడీ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో.. యంగ్ హీరో సంగీత్ శోభన్ నటించిన రాకాస చిత్రం మంచి బజ్‌ ను క్రియేట్ చేస్తోంది;

Update: 2026-03-21 14:40 GMT

టాలీవుడ్‌ లో కొత్త తరహా హారర్ కామెడీ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో.. యంగ్ హీరో సంగీత్ శోభన్ నటించిన రాకాస చిత్రం మంచి బజ్‌ ను క్రియేట్ చేస్తోంది. నయన్ సారిక హీరోయిన్‌ గా నటిస్తున్న ఆ సినిమాను మానస శర్మ తెరకెక్కిస్తున్నారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్న ఆ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.




సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్‌ ను స్పీడప్ చేశారు. ఇప్పటికే విడుదలైన రపప్పా, పదే పదే పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని ట్రెండింగ్‌ లో నిలిచాయి. రీసెంట్ గా విడుదల చేసిన స్నేక్ డ్యాన్స్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది. ఆ పాటలో క్యాచీ ట్యూన్, ఫన్నీ లిరిక్స్, ఎనర్జీతో నిండిన డ్యాన్స్ స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ముఖ్యంగా సినిమాలోని ప్రధాన నటీనటులంతా కలిసి చేసిన స్నేక్ డ్యాన్స్ ప్రేక్షకులను అలరిస్తోంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తమదైన కామెడీ టైమింగ్‌తో పాటు ఫన్నీ డ్యాన్స్ మూమెంట్స్‌ తో నవ్వులు పంచారు. హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక స్టెప్పులు కూడా ఆకట్టుకుంటున్నాయి. పాటలో మన బాలు గాడికి బ్రేక్ డ్యాన్స్ రావట్లే... వీరు గాడికి వీణ స్టెప్ పలకట్లే.. వంటి లైన్స్ వినసొంపుగా ఉండటమే కాకుండా, వినగానే పాడుకునేలా ఉండడం ప్రత్యేకతగా నిలిచింది.

సాంగ్‌ కు అనుదీప్ దేవ్ సంగీతం అందించగా.. రఘురామ్ సాహిత్యం రాశారు. బెన్నీ దయాల్, మనీషా పాండ్రంకి, రితేష్ జి రావు, లక్ష్మీ మేఘన, వినాయక్ కలిసి ఆలపించిన తీరు ఆ పాటకు మెయిన్ అసెట్ గా మారింది. అయితే సాంగ్ చివర్లో నిర్మాత నిహారిక కొణిదెల చేసిన డ్యాన్స్ ప్రత్యేక హైలైట్‌ గా నిలిచింది. నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఓ పాటలో డ్యాన్స్ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆమె స్టెప్పులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్, ఈసారి హారర్ ఫాంటసీ జానర్‌ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో రూపొందిన రాకాస చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. టీజర్, పాటలు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషం.

జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ పై రూపొందిన ఆ సినిమా.. కామెడీ, హారర్, ఫాంటసీ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని టాక్. ఓటీటీ సిరీసులతో మంచి పేరు తెచ్చుకున్న మానస శర్మ, ఈ చిత్రంతో దర్శకురాలిగా టాలీవుడ్‌ కు పరిచయం అవుతున్నారు. మొత్తంగా స్నేక్ డ్యాన్స్ పాటతో రాకాస మూవీకి మంచి మ్యూజికల్ బూస్ట్ లభించినట్లు కనిపిస్తోంది.మరి సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News