• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల నిధి వెయిటింగ్‌...

అందాల నిధి వెయిటింగ్‌ ఇంకా ఎన్నాళ్లు?

| నిధి అగర్వాల్‌తో పాటు ఆమె ఫ్యాన్స్ ఆ రెండు సినిమాల విడుదల ఎప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-03-17 16:30 GMT

నిధి అగర్వాల్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం కాబోతున్నా ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. కొందరు హీరోయిన్స్ కెరీర్‌ ఆరంభంలో ఏడాదికి రెండు మూడు అంతకు మించి సినిమాలు చేసిన దాఖలు ఉన్నాయి. కానీ నిధి అగర్వాల్‌ మాత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పెద్దగా ఫలితాన్ని పొందలేదు. ఆ సినిమా వల్ల వరుస ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది. తెలుగులో ఈమె ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ రెండు సినిమాల విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నిధి అగర్వాల్‌తో పాటు ఆమె ఫ్యాన్స్ ఆ రెండు సినిమాల విడుదల ఎప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ ముద్దుగుమ్మ 2022 లో చివరగా హీరో, కలగ తలైవన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆఫర్లు రాలేదు. కానీ లక్కీగా తెలుగులో ఏకంగా పవన్‌ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో అవకాశం కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా టాలీవుడ్‌లో వరుసగా పది సినిమా ఆఫర్లు వస్తాయని నిధి అగర్వాల్‌ ఆశ పడుతుంది. కానీ పవన్‌ కళ్యాణ్ బిజీ షెడ్యూల్‌ వల్ల దాదాపు మూడు ఏళ్లుగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎప్పటికీ ఈ సినిమా విడుదల అయ్యేది క్లారిటీ లేదు. కానీ మేకర్స్ మాత్రం ఈ ఏడాదిలో విడుదల చేస్తామని అంటున్నారు. ఫ్యాన్స్ నమ్మకం లేదు దొర అంటూ మీమ్స్ చేస్తున్నారు.

వీరమల్లు సినిమా కాకుండా ప్రభాస్‌తో రాజాసాబ్‌ సినిమాలోనూ ఈ అందాల నిధి నటిస్తుంది. వీరమల్లు సినిమా మాదిరిగానే రాజాసాబ్ సినిమా సైతం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల ఉంటుందని అంతా అన్నారు. కానీ షూటింగ్‌ ఆలస్యం కావడంతో మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అందాల నిధి అగర్వాల్‌ రాజాసాబ్‌ సినిమాపైనా చాలా ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా మూడు నాలుగు పెద్ద ఆఫర్లు వస్తాయనే నమ్మకంతో నిధి అగర్వాల్ ఉంది. కానీ ఆమె మాత్రం ఆ సినిమాలతో ఎప్పుడు వచ్చేది క్లారిటీ రావడం లేదు.

ఆ రెండు సినిమాలు అలా ఉండగా ఇటీవల ఒక సినిమాలో ఐటెం సాంగ్‌ చేసే అవకాశం దక్కిందని, కానీ నిధి అగర్వాల్‌ అందుకు నిరాకరించిందనే వార్తలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలో విడుదల అయితే వచ్చే ఏడాదిలో నిధి అగర్వాల్‌ వరుస సినిమాలకు కమిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్యాప్‌లో చిన్న సినిమాలు అయినా చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే వీరమల్లు, రాజాసాబ్‌ సినిమాలు విడుదల అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    
  • NidhhiAgerwal 
  • Tollywood 
  • PawanKalyan 
  • Prabhas 
  • Veeramallu 
  • RajaSaab 
  • TollywoodCinema 
  • MovieUpdates 
  • SouthCinema 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS