పవన్ కళ్యాణ్ పీఎం అయినా ఆశ్చర్యం లేదు.. నిధి అగర్వాల్ బోల్డ్ స్టేట్‌మెంట్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై 'హరిహర వీరమల్లు' బ్యూటీ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై 'హరిహర వీరమల్లు' బ్యూటీ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాది విడుదలైన వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ, ఆ షూటింగ్ సమయంలో పవన్‌ను దగ్గర నుండి గమనించిన నిధి.. ఆయన వ్యక్తిత్వం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె పవన్ పొలిటికల్ వ్యక్తిత్వం గురించి తన మనసులో మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక సింహం లాంటివారని, ఆయన చాలా ధైర్యవంతుడని కొనియాడారు. ఎవరికీ లేనంత తెగింపు ఆయన సొంతమని, ఏదైనా సమస్య వస్తే ఒంటరిగా పోరాడగల సత్తా ఆయనకు ఉందని ఆమె పేర్కొన్నారు. పవన్‌ను ఒక పవర్ ఫుల్ లీడర్‌గా చూస్తున్న నిధి, ఆయనలో ఉన్న ఆ ధైర్యమే ఆయన్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని వెల్లడించారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మన దేశానికి ప్రధానమంత్రి అయినా తాను అస్సలు ఆశ్చర్యపోనని నిధి అగర్వాల్ ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆయన ఎప్పటికైనా పీఎం రేంజ్ కు వెళ్తారని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రాలేదని, చాలా కాలంగా గ్రౌండ్ లెవల్ లో ఎంతో కష్టపడుతున్నారని ఆమె గుర్తుచేశారు. ఆయన పట్టుదల చూస్తుంటే దేశ అత్యున్నత పదవికి అర్హుడని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం వల్ల పవన్ పేరు దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోంది కానీ, ఆయన ఎప్పటి నుంచో తన టీమ్ ని పార్టీని ఒక క్రమపద్ధతిలో నిర్మించుకుంటూ వస్తున్నారని నిధి వివరించారు. ఆయన విజన్ ఈరోజుది కాదని, ఏళ్ల తరబడి చేస్తున్న కృషికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఆమె చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ధైర్యంగా ఉంటూ, పది మంది కోసం నిలబడే గుణం పవన్‌ను ఒక గొప్ప నాయకుడిని చేసిందని ఆమె విశ్లేషించారు.
పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి చెబుతూ.. ఆయన వ్యక్తిత్వమే తనను ఎంతో ఆకట్టుకుందని నిధి అన్నారు. రాజకీయాల్లో ఇంత బిజీగా ఉండి కూడా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్లడం ఆయనకే సాధ్యమని ప్రశంసించారు. ఇక నిధి అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే, ఆమెకు ఈ మధ్య కాలంలో టైమ్ అంతగా కలిసి రావడం లేదని చెప్పాలి. వీరమల్లు సినిమాతో పాటు ఈ సంక్రాంతికి ప్రభాస్ తో కలిసి నటించిన 'రాజాసాబ్' కూడా బాక్సాఫీస్ వద్ద ఆమెకు ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. వరుసగా రెండు భారీ ప్రాజెక్టులు చేసినా, అవి సక్సెస్ కాకపోవడం నిధి కెరీర్ కు కొంత మైనస్ అనే చెప్పాలి. అయినప్పటికీ ఆమె మళ్ళీ బిజీ అయ్యేలా అడుగులు వేస్తోంది. ఇక అందాల నిధికి నెక్స్ట్ ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.