ఒక్క హిట్ తోనే హీరోయిన్ ఓరియేంటెడ్!
నిధి అగర్వాల్ కెరీర్ లో ఇప్పటి వరకూ తెలుగులో నటించిన సినిమాలు ఐదు. వాటిలో హిట్ అయిన చిత్రాలెన్ని? అంటే ఒకటి మాత్రమే.;
నిధి అగర్వాల్ కెరీర్ లో ఇప్పటి వరకూ తెలుగులో నటించిన సినిమాలు ఐదు. వాటిలో హిట్ అయిన చిత్రాలెన్ని? అంటే ఒకటి మాత్రమే. అదే 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా మినహా అన్ని చిత్రాలు అంచనాలు అందుకోవడంలో విఫలమైనవే. అవన్నీ స్టార్ హీరోలతో నటించిన సినిమాలే అయినా? వైఫల్యాలు నిధి స్టార్ డమ్ ని తీసుకు రాలేకపోయాయి. ఇటీవలే భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లో రిలీజ్ అయిన 'హరిహరవీరమల్లు' తిరుగులేని విజయం సాధిస్తుందనుకున్నారంతా? కానీ ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశనే మిగిల్చింది.
కొత్త డైరెక్టర్ తో ప్రయత్నం:
ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ `రాజాసాబ్` మాత్రమే. అమ్మడు ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుంది. జరిగిందేదో? జరిగిపోయింది ప్రభాస్ సినిమాతోనైనా బూస్టింగ్ దక్కుతుందని చాలా ఆశలతో ఎదురు చూస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానుంది. సరిగ్గా ఇదే సమయంలో నిధఙ అగర్వాల్ ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రం ప్రకటనతో రావడం విశేషం. నిఖిల్ కార్తీక్ అనే కొత్తకుర్రాడు ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పుప్పాల అప్పలరాజు నిర్మిస్తున్నారు. ఇదొక హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్ .
అవకాశమే గొప్ప విషయం:
బడ్జెట్ లెక్కలు బయటకు రాలేదు గానీ నిధితో లేడీ ఓరియేంటెడ్ ప్రకటనతోనే ఈ వార్త సోషల్ మీడియాలో దావానాలా వ్యాపిస్తోంది. వరుస ప్లాప్ ల్లో ఉన్నా నిధితో లేడీ ఓరియేంటెడ్ చిత్రమేంటనే విమర్శ వ్యక్త మవుతోంది. ఆ సంగతి పక్కన బెడితే నిధి అగర్వాల్ ఇలాంటి సమయంలో అవకాశం రావడం గొప్ప విషయం. సోలో నాయికగా సత్తా చాటలేకపోయినా అమెను నమ్మి లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో అవకాశం దక్కింది.
వాళ్ల సరసన నిధి అగర్వాల్:
ఇలాంటి సినిమాలో పూర్తి స్థాయి నటనకు ఆస్కారం ఉంటుంది. హీరోతో సినిమా అంటే పాట, రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితం. కానీ ఉమెన్ సెంట్రిక్ చిత్రమంటే కథ అంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబట్టి తనలో అసలైన నటిని బయటకు తీయోచ్చు. మరి ఈ అవకాశాన్ని నిధి అగర్వాల్ ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటుందో. ఇప్పటికే ఈ తరహా సినిమాలు చేయడంలో అనుష్క శెట్టి ఆరితేరింది. కీర్తి సురేష్, రష్మికా మందన్నా లాంటి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల సరసన నిధి కూడా చేరుతున్నట్లే.