• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆమెకు కలిసి వచ్చేలా...

ఆమెకు కలిసి వచ్చేలా వీరమల్లు .!

| స్టార్ హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నా కూడా సినిమాల ఎంపిక వల్లో లేదా మరో కారణాల వల్ల కొందరు భామలు వెనక పడుతుంటారు.

By - Tupaki Desk
Update: 2025-05-16 09:30 GMT

స్టార్ హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నా కూడా సినిమాల ఎంపిక వల్లో లేదా మరో కారణాల వల్ల కొందరు భామలు వెనక పడుతుంటారు. ఇలాంటి వారి లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంటుంది. అందులో కచ్చితంగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో పాపులారిటీ సంపాదించిన నిధి అగర్వాల్ తమిళ్ లో భూమి, ఈశ్వరన్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2022లో గల్లా అశోక్ తో హీరో సినిమా చేసింది అమ్మడు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా ఛాన్స్ లు రాలేదు.

ఐతే ఇప్పుడు ఒకేసారి రెండు భారీ సినిమాలతో అమ్మడు రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న నిధి ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా కూడా చేస్తుంది. వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ ఫిమేల్ లీడ్ గా నటించడం విశేషం. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న వీరమల్లు సినిమా నాలుగేళ్లుగా తీస్తూనే ఉన్నారు. క్రిష్ డైరెక్షన్ లో మొదలైన ఈ సినిమా ఇప్పుడు జ్యోతికృష్ణ చేతుల్లోకి వచ్చింది.

కొన్నాళ్లుగా రిలీజ్ విషయంలో సందిగ్ధంగా ఉన్న వీరమల్లు సినిమాను ఫైనల్ గా జూన్ 12న రిలీజ్ లాక్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు చేయాల్సిన పనులన్నీ ఈమధ్యనే పూర్తి చేశాడని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఎంత ఉపయోగపడుతుందో కానీ హీరోయిన్ నిధి అగర్వాల్ కి మాత్రం కచ్చితంగా ప్లస్ అయ్యేలా ఉంది. నిధి లుక్స్ యాక్టింగ్ ఇవన్నీ వీరమల్లుకి సపోర్ట్ చేసేలా ఉన్నాయని తెలుస్తుంది.

వీరమల్లు సినిమాతో పాటుగా ప్రభాస్ రాజా సాబ్ సినిమాను కూడా చేస్తుంది నిధి అగర్వాల్. తెలుగులో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్న నిధి వీరమల్లు, రాజా సాబ్ సినిమాలతో సూపర్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. మరి అమ్మడు కోరినట్టుగా రిజల్ట్ వస్తుందా లేదా అన్నది చూడాలి. కోలీవుడ్ లో నిధి అగర్వాల్ కి స్టార్ క్రేజ్ వచ్చింది. ఐతే అక్కడ కూడా ఎందుకో అమ్మడికి సడెన్ గా అవకాశాలు కరువయ్యాయి. ఐతే ఒక సూపర్ హిట్ సినిమా పడితే మాత్రం నిధి తిరిగి మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. కచ్చితంగా నిధికి ఆ స్కోప్ ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Tags:    
  • NidhhiAgerwal 
  • HariHaraVeeraMallu 
  • RajaSaab 
  • TollywoodActress 
  • Prabhas 
  • PawanKalyan 
  • TollywoodNews 
  • ActressComeback 
  • IndianCinema 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS