గుబులు రేపుతున్న టీవీ న‌టి బులుగు బికినీ

భార‌త‌దేశంలోని అత్యంత బోల్డెస్ట్ టీవీ స్టార్ ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌కు వంద‌శాతం క‌చ్ఛితమైన స‌మాధానం- నియా శ‌ర్మ. మోనోకినీలు, బికినీల‌తో చెల‌రేగిపోవ‌డంలో నియా శ‌ర్మ త‌ర్వాతే.;

Update: 2025-07-08 03:40 GMT

భార‌త‌దేశంలోని అత్యంత బోల్డెస్ట్ టీవీ స్టార్ ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌కు వంద‌శాతం క‌చ్ఛితమైన స‌మాధానం- నియా శ‌ర్మ. మోనోకినీలు, బికినీల‌తో చెల‌రేగిపోవ‌డంలో నియా శ‌ర్మ త‌ర్వాతే. పార్టీల్లో చిల్లింగ్ మోడ్ లో క‌నిపించే నియా శ‌ర్మ అత్యంత భారీ పారితోషికం అందుకుంటున్న తార‌గాను వెలిగిపోతోంది.


టీవీ నటి నియా శర్మ తన విహారయాత్ర నుండి అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తుంది. తన అద్భుతమైన లుక్స్, బోల్డ్ ఫ్యాషన్ ఎంపికలతో గుబులు రేపే ఈ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్ల‌కు ఇన్ స్టాలో భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.


నియా శర్మ ఇప్పుడు బీచ్ ఎండ‌లో తీరం వెంబ‌డి షికార్ చేస్తూ సెల్ఫీని పోస్ట్ చేసింది. రాబోయే 3 గంటల్లో మీరు విమానంలో ప్రయాణించాలి.. 50 డిగ్రీల వేడి... 500 ఫోటోలు.. ఫోన్ హెచ్చరిక ఐఫోన్ చల్లబడాలి..#దుబాయ్ కి ప్ర‌యాణం అనే క్యాప్షన్ ని ఇచ్చింది.


ఈ ఫోటోగ్రాఫ్స్ లో నియాన్ కాంతుల నియా శ‌ర్మ ఆకాశ నీలం రంగు బీచ్‌వేర్ లో గుబులు రేపుతోంది. క‌ళ్ల‌కు బ్లాక్ షేడ్స్, మెడ‌లో బ‌రువైన‌ గొలుసు ధరించి పెప్పీగా క‌నిపిస్తోంది. నేపథ్యంలో బులుగు జిలుగు సముద్రం క‌నిపిస్తోంది. స‌ముద్రం ఆవ‌ల ఆకాశ హార్మ్యాలు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. బికినీ లుక్ లో వ‌రుస ఫోటోల‌ను షేర్ చేసింది. ఇక నియా త‌న‌కు ఉన్న సైక్లింగ్ హ్యాబిట్ గురించి కూడా ప్ర‌స్థావించింది. మ‌హ‌మ్మారీ స‌మ‌యంలో 30-40 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ సైక్లింగ్ చేసాన‌ని ఫిట్నెస్ యాక్టివిటీలో త‌న స్నేహితుల‌తో పాటు పాలుపంచుకుంటాన‌ని తెలిపింది. సైక్లింగ్ కార‌ణంగా గాయాలు అయినా కానీ దానిని ఎంజాయ్ చేస్తాన‌ని కూడా తెలిపింది.

స్టార్ ప్లస్ షో `ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై`లో క‌నిపించిన‌ తర్వాత నియా శర్మ చాలా పాపుల‌రైంది. జమై రాజా, ఇష్క్ మే మార్జావాన్, నాగిన్ 4 వంటి షోలలో తన నటనతో పాపుల‌రైంది. నియా చివరిగా `సుహాగన్ చూడైల్` (ఏజెన్సీ)లో కనిపించింది.

Tags:    

Similar News