• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్టోబర్ లో సందడి చేయబోయే...

అక్టోబర్ లో సందడి చేయబోయే సినిమాలివే

| మొదటి వారం నుంచి నెల ఆఖరు వరకు టైర్ 2 హీరోల సినిమాలతో పాటు మీడియం రేంజ్, చిన్న సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-10-01 22:30 GMT

అక్టోబర్ నెలలో సినిమాల సందడి హెవీగా కనిపిస్తోంది. మొదటి వారం నుంచి నెల ఆఖరు వరకు టైర్ 2 హీరోల సినిమాలతో పాటు మీడియం రేంజ్, చిన్న సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలోపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరికొన్ని స్టార్ క్యాస్టింగ్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో రాబోతున్నాయి. వీటిలో ఎన్ని ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ ఆఖరులో రిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘దేవర’, కార్తీ ‘సత్యం సుందరం’ సినిమాల సందడి దసరా వరకు థియేటర్స్ లో ఉంటుంది.

ఇక అక్టోబర్ 4న అరడజను సినిమాల వరకు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. అంతకంటే ఒక రోజు ముందు రామ్ మిట్టకంటి, పవిత్ర కస్వి జంటగా భాస్కర్ యాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిట్టిపొట్టి’ మూవీ రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 4న శ్రీవిష్ణు హీరోగా హసత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ కాన్సెప్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘స్వాగ్’ రిలీజ్ కానుంది. రీతువర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మూవీ పైన పాజిటివ్ బజ్ ఉంది. ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్ లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’ కూడా అదే రోజు థియేటర్స్ లోకి రాబోతోంది.

ఓషో తులసీరామ్ దర్శకత్వంలో సాయి ధన్సిక నటించిన థ్రిల్లర్ మూవీ ‘దక్షిణ’. నోయల్, రిషిత నెల్లూరి జంటగా తెరకెక్కిన ‘బహిర్భూమి’. పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ సెలబ్రెటీ’. ఈటీవీ ప్రభాకర్ కొడుకు హీరోగా రెడీ అయిన ‘రామ్ నగర్ బన్నీ’.. ఈ మూవీస్ అన్ని కూడా మొదటి వారం అక్టోబర్ 4న రిలీజ్ అవుతున్నాయి. దసరా కానుకగా సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయ్యన్’, గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘విశ్వం’ భారీ బడ్జెట్ చిత్రాలుగా అక్టోబర్ 10న థియేటర్స్ లోకి వస్తున్నాయి.

అలాగే సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 11న కన్నడంలో ధృవ్ షర్జా హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘మార్టిన్’, అలియా భట్ హిందీ మూవీ ‘జిగ్రా’ ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. అక్టోబర్ 12న సుహాస్ ‘జనక అయితే గనక’ రిలీజ్ అవుతోంది. ఈ నెల ఆఖరి వారంలో అక్టోబర్ 25న ‘గ్యాంగ్ స్టార్’ అనే చిన్న సినిమా, అలాగే సాయి రోనక్, ప్రగ్య నగ్రా నటించిన ‘లగ్గం’, మూవీ రిలీజ్ అవ్వనున్నాయి.

ఈ నెల 31న దీపావళి కానుకగా దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘లక్కీ భాస్కర్’, సత్యదేవ్, డాలీ ధనుంజయ్ మెయిన్ లీడ్ గా చేసిన ‘జీబ్రా’ రిలీజ్ కానున్నాయి. అలాగే శివకార్తికేయన్, సాయి పల్లవి జోడీగా తెరకెక్కిన ‘అమరన్’ కూడా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దీంతో పాటు కన్నడం శ్రీమురళీ హీరోగా తెరకెక్కిన ‘భగీర’ రిలీజ్ అవ్వనుంది.

Tags:    
  • Tollywood 
  • Release 
  • Swag 
  • Luckybaskhar 
  • Sreevishnu 
  • Vettaiyan 
  • Ramnagarbunny 
  • Bagheera 
  • Viswam 
  • RajiniKanth 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS