నేత్ర మంతెన‌-వంశీ గ‌దిరాజు పెళ్లి ఖ‌ర్చు 300కోట్లు

తాజ్ లేక్ ప్యాలెస్ - లేక్‌సైడ్ బంగ్లా చాలా ప్ర‌త్యేక‌మైన వెన్యూ. ఉదయపూర్‌లోని లేక్ పిచోలా మధ్యలో ఉన్న అద్భుతమైన 5 స్టార్ బ‌స అతిథుల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది.;

Update: 2025-11-25 18:30 GMT

బిలియ‌నీర్ డాట‌ర్, తెలుగ‌మ్మాయి నేత్ర మంతెన- వంశీ గాది రాజు వివాహం ఉద‌య్ పూర్ (రాజ‌స్థాన్) రాజ‌ప్రాకారంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌ల‌కు జూనియ‌ర్ ట్రంప్, జెన్నిఫ‌ర్ లోపేజ్ వంటి అంత‌ర్జాతీయ‌ ప్ర‌ముఖులు అటెండ‌య్యారు. నవంబర్ 23న జ‌రిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం మంతెన కుటుంబం ఏకంగా 300కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా అంత‌ర్జాతీయ పాప్ స్టార్ జెన్నిఫ‌ర్ లోపేజ్ పారితోషికం స‌హా బాలీవుడ్ స్టార్ల కోసం భారీ మొత్తంలో బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేసారు.

జెన్నిఫర్ లోపెజ్ అద్భుత‌మైన లైవ్ పెర్ఫామెన్సెస్ అహూతుల‌ను ర‌క్తి క‌ట్టించ‌గా, రణ్‌వీర్ సింగ్ ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్సెస్, షాహిద్ క‌పూర్, జాన్వీ క‌పూర్ ల డ్యాన్సింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచాయి.

తాజ్ లేక్ ప్యాలెస్ - లేక్‌సైడ్ బంగ్లా చాలా ప్ర‌త్యేక‌మైన వెన్యూ. ఉదయపూర్‌లోని లేక్ పిచోలా మధ్యలో ఉన్న అద్భుతమైన 5 స్టార్ బ‌స అతిథుల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది. అతిథులకు భోజనం, రాత్రి బస, అలంకరణ ఖర్చు కోట్ల‌లో ఉంటుంద‌ని చెబుతున్నారు.

వంశీ - నేత్రాల వివాహ వేడుకలు ప్రధానంగా ఉదయపూర్‌లోని తాజ్ లేక్ ప్యాలెస్- జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌లలో జరిగాయి. ఈ వెన్యూ చాలా ఖరీదైనవి. ఓవ‌రాల్ గా పెళ్లికి మొత్తం ఖర్చు జిఎస్‌టి మినహాయించి 300 కోట్లు. తాజ్ లేక్ ప్యాలెస్‌లో ఈవెంట్‌లు ఆహారం, అలంకరణ - సేవలను బట్టి పది లక్షల నుండి కోట్ల‌లో ఖ‌ర్చు మొద‌ల‌వుతుంది. దీనితో పాటు జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌లో జరిగే ఈవెంట్‌లు ఏవైనా కేవలం ఒక సాధారణ వివాహానికి దాదాపు కోటి రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం ఖ‌ర్చు పెళ్లికి కేవ‌లం వెన్యూ కోసం రూ. 40 కోట్ల నుండి రూ. 60 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. లేక్ ప్యాలెస్ వెన్యూలో భోజనం ఒక్కొక్కరికి రూ. 8,500, హై టీ ఒక్కొక్కరికి రూ. 3,500, రాత్రి భోజనం పన్నులు మినహాయించి ఒక్కొక్కరికి రూ. 12,000 వరకు ఉండవచ్చు.

మొత్తం 65 గదులు 18 సూట్‌లతో ఒక్కొక్క దానికి ఒక‌ రాత్రికి రూ. 50,000 నుండి రూ. 1,00,000 వరకు ఖర్చవుతుంది. మొత్తం ఖర్చు స్నాక్స్ -కస్టమైజ్డ్ ఏర్పాట్లు క‌లుపుకుని రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలంకరణ ఖర్చు రూ. 30-35 లక్షల మధ్య ఉంటుంది.

నేత్ర మంతెన - వంశీ గాదిరాజు మెహందీ ఫంక్షన్ కూడా అదే వేదికలో నిర్వహించారు. ఈ వేడుకలో మాధురి దీక్షిత్, నోరా ఫతేహి, దియా మీర్జా, నోరా ఫ‌తేహి ప్ర‌ద‌ర్శ‌న‌లు హైలైట్ గా నిలిచాయి. మాధురి దీక్షిత్ రూ. 35 లక్షల నుండి రూ. 1 కోటి వరకు, నోరా ఫతేహి రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు వసూలు చేస్తుండ‌గా, దియా మీర్జా రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షల మధ్య వ‌సూలు చేస్తారు.

21 నవంబర్ 2025న, నేత్ర మంతెన-వంశీ గదిరాజు సంగీత్ వేడుకలో షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్, కృతి సనన్, వరుణ్ ధావన్ తదితరులు ప్రదర్శనలు ఇచ్చారు. కరణ్ జోహార్, సోఫీ చౌదరి ఈ కార్యక్రమానికి హోస్టులు. రణ్‌వీర్ సింగ్ -షాహిద్ కపూర్ ప్రైవేట్ ప్రదర్శనలకు రూ. 3-4 కోట్లు వసూలు చేస్తారు. ఇతర ప్రముఖులు కోట్ల‌లో వ‌సూలు చేసేవారే.

పెద్ద ప్యాకేజీ అంత‌ర్జాతీయ స్టార్ కే

మంతెన‌- గాదిరాజు పెళ్లిలో అతిపెద్ద ఆకర్షణ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్. పెళ్లి ముగింపు రోజు జెన్నిఫ‌ర్ ప్రదర్శన కోసం ఆమెకు దాదాపు రూ. 17 కోట్లు చెల్లించినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. జెన్నిఫ‌ర్ లోపేజ్ గులాబీ మిశ్ర‌మం బంగారు చీరలో క‌నిపించింది. కానీ వేదిక‌ల‌పై ఆడి పాడేప్పుడు బాడీ హ‌గ్గింగ్ దుస్తుల‌లో ఒంపు సొంపుల‌ను ప్ర‌ద‌ర్శించింది.

ఇక రాజ‌స్థాన్- ఉదయపూర్ వివాహంలో జెన్నిఫ‌ర్ లోపెజ్ ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2015లో జగ్‌మందిర్‌లో జరిగిన గ్రాండ్ హిందూజా వివాహంలో ఆడి పాడినందుకు భారీ మొత్తం వ‌సూలు చేసింది. ఆ వేడుక వేలాది మంది అతిథులతో క‌ళ‌క‌ళ‌లాడింది. చార్టర్డ్ విమానాలు, సినీ తారల ప్ర‌ద‌ర్శ‌న‌ల కోసం భారీ మొత్తంలో ఖ‌ర్చు చేసారు.

Tags:    

Similar News