యువరాణి డీప్‌ఫేక్‌ న్యూ..D వీడియో సంచలనం..!

డీప్ ఫేక్ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి నెదర్లాండ్స్‌కి చెందిన యువరాణి కథరినా అమాలియా యొక్క డీప్‌ఫేక్ వీడియోను క్రియేట్‌ చేసి ఏకంగా పో...ర్న్‌ వెబ్‌ సైట్‌లో పోస్ట్‌ చేశారు.;

Update: 2025-08-21 08:30 GMT

డీప్‌ఫేక్‌ టెక్నాలజీ వల్ల ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సోషల్‌ మీడియాలో ప్రముఖుల ఫేస్‌లను మార్ఫింగ్‌ చేయడం ద్వారా, బాడీలను మార్చడం ద్వారా రకరకాలుగా వీడియోలను క్రియేట్‌ చేస్తున్నారు. ఒరిజినల్‌ వీడియోలకు ఏమాత్రం తీసి పోకుండా డీప్‌ఫేక్ వీడియోలను సృష్టిస్తున్న విషయం తెల్సిందే. అయితే సాధారణ వ్యక్తుల డీప్‌ఫేక్ వీడియోలు పెద్దగా రావడం లేదు, కానీ సెలబ్రిటీలు, పెద్ద మనుషులు, గొప్ప వారి ఫేస్‌లతో డీప్‌ఫేక్ వీడియోలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. డీప్‌ఫేక్ వీడియోల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ మధ్య ఇండియాలో ఒక కొంత మంది స్టార్స్‌ యొక్క డీప్‌ ఫేక్ వీడియోలను క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.

ప్రిన్సెస్‌ కథరినా డీప్‌ఫేక్ వీడియో

డీప్ ఫేక్ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి నెదర్లాండ్స్‌కి చెందిన యువరాణి కథరినా అమాలియా యొక్క డీప్‌ఫేక్ వీడియోను క్రియేట్‌ చేసి ఏకంగా పో...ర్న్‌ వెబ్‌ సైట్‌లో పోస్ట్‌ చేశారు. విషయం తెలిసి అక్కడి అధికారులు వెంటనే స్పందించారు. దాదాపుగా 70 మందికి సంబంధించిన మహిళల డీప్‌ఫేక్‌ వీడియోలను సైతం క్రియేట్‌ చేసి అదే వెబ్‌ సైట్‌లో పోస్ట్‌ చేసినట్లుగా గుర్తించారు. నిమిషాల వ్యవధిలోనే ఆ వెబ్‌ సైట్‌ను తొలగించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ వీడియోలు నిమిషాల్లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. యువరాణి అశ్లీల వీడియోలు అంటూ సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారంతో ఒక్కసారిగా అంతా ఆ వెబ్‌ సైట్‌ను చూశారట. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌

మరికొన్నాళ్లకు నెదర్లాండ్స్‌కి రాణిగా బాధ్యతలు చేపట్టబోతున్న కాథరినా అమాలియా ఇలాంటి డీప్‌ఫేక్‌ వీడియో కారణంగా వార్తల్లో నిలవడంతో ఆ దేశ ప్రజలు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ వినియోగించడం అనేది ఖచ్చితంగా చట్టపరంగా నిషేదం విధించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. యువ రాణి విషయంలో జరిగింది కనుక అధికారులు స్పీడ్‌గా స్పందించారు. సామాన్యుల విషయంలో జరిగితే పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సామాన్యులు సోషల్‌ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు డీప్‌ఫేక్ వీడియోపై యువరాణి స్పందించలేదు.

నెదర్లాండ్స్‌ కి కాబోయే రాణి

2003, డిసెంబర్‌ 7న జన్మించిన కాథరినా అమాలియా పదేళ్ల వయసులోనే రాజ కుమారిగా బాధ్యతలు స్వీకరించింది. పదేళ్ల వయసులోనే కింగ్‌ విల్లెం అలెగ్జాండర్‌, క్వీన్‌ మాక్సిమా దంపతులు పటాభిషేకం చేశారు. నెదర్లాండ్స్‌కి భవిష్యత్తు రాణి కాథరినా అంటూ ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాచ మర్యాదలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్న కాథరినా పాతికేళ్ల వయసు వచ్చిన తర్వాత రాణిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. ఆమె రాణిగా పట్టాభిషేకంకు రెడీ అవుతున్న సమయంలో ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు రావడంతో ఆ దేశ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News