నెట్‌ఫ్లిక్స్ ఆ సినిమాల‌నే కొంటుందా?

నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్స్ గా రిలీజైన ది రాయ‌ల్స్, ది జ్యువెల్ థీఫ్ తో పాటూ మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కు కూడా యూజ‌ర్ల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.;

Update: 2025-05-29 01:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టించిన రీసెంట్ ఫిల్మ్ రెట్రో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో ఓటీటీ ప్రీమియ‌ర్ కు రెడీ అవుతోంది. కానీ ఆ స‌బ్‌స్క్రైబ‌ర్లు మాత్రం దాన్ని చూడ్డానికి పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించ‌డం లేదు. దానికి కార‌ణం రెట్రో థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డ‌మే. థియేట‌ర్ల‌లో పెద్ద‌గా ఆడ‌కుండా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపుగా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ‌వుతున్నప్ప‌టికీ దానిపై ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు.

దీనికి కొన్నాళ్ల ముందు నెట్‌ఫ్లిక్స్ స‌ల్మాన్ ఖాన్ సికంద‌ర్ సినిమాను కూడా త‌న ప్లాట్‌ఫామ్ లో రిలీజ్ చేసింది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపుగానే నిలిచింది. ఓటీటీలో కూడా సికంద‌ర్ ఫ్లాపుగానే మిగిలింది. అయితే ఇప్పుడు స‌బ్‌స్క్రైబ‌ర్ల నుంచి నెట్‌ఫ్లిక్స్ కు ఓ ప్ర‌శ్న ఎదుర్కొంది. నెట్‌ఫ్లిక్స్ ఫ్లాపు సినిమాల‌ను మాత్ర‌మే కొనాల‌ని డిసైడైందా అని వినియోగ‌దారులు ప్ర‌శ్నిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్స్ గా రిలీజైన ది రాయ‌ల్స్, ది జ్యువెల్ థీఫ్ తో పాటూ మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కు కూడా యూజ‌ర్ల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఒరిజిన‌ల్సే ఇలా ఉన్నాయనుకుంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తున్న ఫీచ‌ర్ ఫిల్మ్స్ కూడా క్వాలిటీ లేకుండా పోతున్నాయ‌ని యూజ‌ర్లు విమ‌ర్శిస్తున్నారు. ఎంతో ఎక్కువ ఖ‌ర్చు పెట్టి మ‌రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటున్నామ‌ని కానీ దానికి త‌గ్గ కంటెంట్ ను నెట్‌ఫ్లిక్స్ త‌మ యూజ‌ర్ల‌కు ఇవ్వ‌డం లేద‌ని వారు నిరాశ చెందుతున్నారు.

యూజ‌ర్లు నెట్‌ఫ్లిక్స్ లోని సికంద‌ర్ ను ట్రోల్ చేయ‌డంతో పాటూ, ఇలానే చేస్తే ఇండియ‌న్ ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ స్థాయి ప‌డిపోతుంద‌ని, ఫ్లాపు, యావ‌రేజ్ సినిమాల‌ను కొంటూ నెట్‌ఫ్లిక్ త‌న స్థాయిని అదే త‌గ్గించుకుంటుంద‌ని, దీన్నుంచి బ‌య‌ట ప‌డాలంటే నెట్‌ఫ్లిక్స్ ఎక్స్‌ట్రాఆర్డిన‌రీ కంటెంట్ తో ఆడియ‌న్స్ ముందుకు రావాలి. మ‌రి నెట్‌ఫ్లిక్స్ ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాతి సినిమాల విష‌యంలో అయినా జాగ్ర‌త్త వ‌హిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News