పొట్టి డ్రెస్సులో టిల్లు పాప.. స్టన్నింగ్ లుక్!

'డిజె టిల్లు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్​గా మారిపోయారు నేహా శెట్టి. ఆ సినిమాలో 'రాధిక' పాత్రలో ఆమె చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.;

Update: 2025-11-22 03:53 GMT

'డిజె టిల్లు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్​గా మారిపోయారు నేహా శెట్టి. ఆ సినిమాలో 'రాధిక' పాత్రలో ఆమె చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆ ఒక్క సినిమాతో యూత్​లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తన అందం, అభినయంతో కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయారు. లేటెస్ట్ గా నేహా శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పచ్చని ప్రకృతి మధ్యలో, వైట్ కలర్ లేస్ డిజైన్ ఉన్న కో ఆర్డ్ సెట్​లో దేవకన్యలా మెరిసిపోతున్నారు.




సూర్యకాంతి ఆమెపై పడుతుంటే, ఆ గ్లో మరింత పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. "ఆత్మ మృదువుగా ఉన్న చోట.. కాంతి సరిగ్గా తాకిన వేళ" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన 'మెహబూబా' చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నేహా. మొదటి సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, సిద్దు జొన్నలగడ్డ సరసన 'డిజె టిల్లు'లో నటించి బ్లాక్​బస్టర్ హిట్టు కొట్టారు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగిపోతోంది.

ఆ తర్వాత 'బెదురులంక 2012', 'రూల్స్ రంజన్', ఇటీవల వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్​ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. వరుస అవకాశాలతో టాలీవుడ్​లో బిజీగా మారుతున్నారు.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం నేహా శెట్టి చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్లు, గ్లామరస్ అప్​డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్​ను అలరిస్తుంటారు. చీరకట్టులోనైనా, మోడ్రన్ డ్రెస్సులోనైనా తనదైన శైలిలో మెప్పిస్తూ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటున్నారు. మరి ఈ గ్లామర్ తో అమ్మడు రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News