OG సాంగ్.. ఇలా షాక్ ఇచ్చారేంటి..?
పవర్ స్టార్ తో సాంగ్ అనగానే నేహా శెట్టి సూపర్ ఎగ్జైట్ అయ్యింది. సినిమాలో సాంగ్ చేస్తున్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురువారం రిలీజై ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇచ్చింది. సుజిత్ డైరెక్షన్.. థమన్ మ్యూజిక్ ఓజీని ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చాయి. ఐతే స్టోరీ విషయంలో కొందరు డిజప్పాయింట్ అయ్యారు. అంతేకాదు సెకండ్ హాఫ్ కూడా కాస్త ల్యాగ్ అయ్యిందన్న టాక్ నడుస్తుంది. ఐతే ఇవన్నీ పట్టించుకోకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే సినిమా చూసి ఒక ఫెస్టివల్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు.
OG లోస్పెషల్ సాంగ్..
ఓజీ సినిమాలో ప్రియంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఐతే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నేహా శెట్టి కూడా చేసింది. పవర్ స్టార్ తో సాంగ్ అనగానే నేహా శెట్టి సూపర్ ఎగ్జైట్ అయ్యింది. సినిమాలో సాంగ్ చేస్తున్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. కానీ సినిమాలో ఆ సాంగ్ లేదు. లెంగ్త్ ఇష్యూనా లేదా అనుకున్న రేంజ్ లో ఆ సాంగ్ రాలేదో కానీ ఆ సాంగ్ ని కనీసం ప్రమోషన్స్ లో కూడా వాడలేదు.
ఓజీలో నేహా శెట్టి సాంగ్ పై చిత్ర యూనిట్ ని అడిగితే అసలు ఆ సాంగ్ ని మేము అనౌన్స్ చేయలేదు కదా అని అన్నారు. నేహా శెట్టి ఆ విషయాన్ని చెప్పింది కానీ ఓజీ టీం సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందని చెప్పలేదు. ఐతే సినిమాలో ఈ సాంగ్ ని ఎక్కడ ప్లేస్ చెయాలో తెలియక అలా స్కిప్ చేశారు. ఒకవేళ ఓటీటీలో అయినా యాడ్ చేస్తారా అంటే అది కూడా కష్టమే అనిపిస్తుంది. ఓజీ రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్ లో సుజిత్ ఓజీ స్పెషల్ సాంగ్ ఉన్నట్టు మేము చెప్పలేదు కదా అని షాక్ ఇచ్చారు.
అభిమానిగా పర్ఫెక్ట్ డ్యూటీ..
ఓజీ సినిమాలో అవి ఇవి కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కడినే చూస్తే చాలనేలా సుజిత్ టేకింగ్ ఉంది. ఒక అభిమానిగా అతను పర్ఫెక్ట్ డ్యూటీ చేశాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అయితే OG ని చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేసినట్టు ఉంది. సినిమా థియేటర్ లో ఫ్యాన్స్ అంతా కూడా ఊగిపోతున్నారు. OG సాంగ్స్ మాత్రమే కాదు BGM కూడా థమన్ బెస్ట్ వర్క్ అనేలా ఇచ్చాడు.
స్టార్ సినిమా అనేసరికి ఎడిటింగ్ టేబుల్ మీద చాలా డిస్కషన్స్ జరుగుతాయి. అలాంటి టైమ్ లో సినిమాకు ఏది అవసరమో అదే ఉంచుతారు. కోట్లు ఖర్చు పెట్టి తీశాం కదా అని పెడితే ఆ ఎఫెక్ట్ సినిమా మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈమధ్య ఎక్కువ సినిమాల్లో ఇలా కొన్ని సాంగ్స్ ప్రమోషన్ చేసినా కూడా ఫైనల్ అవుట్ పుట్ లో తీసేస్తున్నారు.