టిల్లుగాని గాళ్ ఫ్రెండ్ టోన్డ్ బాడీ సొగసు
`డీజే టిల్లు` సినిమాలో తన గడుసుతనంతో అందంతో టిల్లు గాడిని ముప్పుతిప్పలు పెట్టిన `రాధిక` అలియాస్ నేహా శెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.;
`డీజే టిల్లు` సినిమాలో తన గడుసుతనంతో అందంతో టిల్లు గాడిని ముప్పుతిప్పలు పెట్టిన `రాధిక` అలియాస్ నేహా శెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన గ్రే స్కేల్ ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.
రాధికా.. ఏమది ఆ అందం!
నేహా శెట్టి అంటేనే ఓ యూనిక్ టోన్డ్ ఫిజిక్, గ్లామర్ గుర్తొస్తుంది. తాజాగా ఈ సొగసరి షేర్ చేసిన ఫోటోల్లో `గ్రేస్కేల్ లో దొరికిపోయాను` అంటూ బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో మెరిసిపోయింది. బాడీ హగ్గింగ్ దుస్తుల్లో తన స్కిన్నీ ఫిగర్‌ను ఎలివేట్ చేస్తూ జెన్ జెడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా కనిపిస్తోంది. గ్రే స్కేల్ ఫోటోల్లో కూడా నేహా కళ్లలో ఉన్న తీక్షణత, ఒంపుసొంపుల హొయలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.
`మెహబూబా`తో ప్రయాణం మొదలు...
నేహా శెట్టి సినీ ప్రయాణం `మెహబూబా` సినిమాతో మొదలైనా కానీ.. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ సరసన నటించిన `రొమాంటిక్` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం `డీజే టిల్లు`. ఆ సినిమాలో రాధిక పాత్రలో నేహా చూపించిన నెగటివ్ షేడ్స్ ఉన్న క్రూయెల్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత `బెదురులంక 2012`, `రూల్స్ రంజన్` వంటి సినిమాలతో తన మార్కెట్ ని సుస్థిరం చేసుకుంది.
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ..
ప్రస్తుతం నేహా శెట్టి చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`లో తన నటనతో మెప్పించిన నేహా ఇప్పుడు మరికొన్ని మీడియం బడ్జెట్ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ డూడ్ చిత్రంతోను నేహా కిక్ ఎలా ఉంటుందో పరిచయం చేసింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా.. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు కూడా ఎంచుకుంటోంది. తమిళ్ , కన్నడ పరిశ్రమల నుంచి కూడా ఈ బ్యూటీకి భారీ ఆఫర్లు అందుతున్నట్లు సమాచారం.
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు ఇలాంటి హా* ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో `దుమ్ము దులుపుతోంది`. టిల్లు గాడిని ముప్పతిప్పలు పెట్టిన ఈ రాధికమ్మ...వరుసగా వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తోంది. మున్ముందు కెరీర్ పరంగా ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేయబోతోందో చూడాలి.