వైరల్ వీడియో: 'చిరుత' బ్యూటీ పొట్టి నిక్కరు సొగసు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `చిరుత` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2026-08-19 03:55 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన `చిరుత` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన గ్లామరస్ ఫోటోలు - వీడియోలతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక విజువల్ ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. వర్షం కురుస్తున్న సమయంలో బయటకు వచ్చి పొట్టి నిక్కరులో ఆమె చిల్ అవుతున్న తీరు నెటిజన్లను.. ముఖ్యంగా కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ కురిసే వర్షంలో నేహా శర్మ తన గ్లామరస్ లుక్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. యువ‌న‌టి ధ‌రించిన‌ షార్ట్స్, స్టైలిష్ అవుట్‌ఫిట్ చూసి అభిమానుల మతులు పోతున్నాయి. దీనికి సంబంధించిన ఎడిటెడ్ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై వైరల్‌గా మారింది. వర్షపు బిందువుల నడుమ స్టైల్ - గ్లామర్ ఎలివేష‌న్ వీడియోకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్-పోస్ట్‌ను ఒక ఫ్యాన్ పేజీ ప్రత్యేకంగా ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసింది. విశేషమేమిటంటే.. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రముఖ పంజాబీ హిట్ ట్రాక్ `దారు బద్నామ్` ప్లే అవుతోంది. పరం సింగ్ - కమల్ కాల్హోన్ పాడిన ఈ చార్ట్‌బస్టర్ సాంగ్.. నేహా శర్మ గ్లామరస్ లుక్స్‌కు సరిగ్గా సరిపోవడంతో ఈ వీడియో చూసేందుకు మరింత ఆకర్షణీయంగా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మెజారిటీ అభిమానులు నేహా అందాన్ని, స్టైలిష్ లుక్స్‌ను ప్రశంసిస్తూ స్టన్నింగ్, హాట్, బ్యూటిఫుల్ అంటూ హార్ట్ - ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ సెక్షన్‌ను నింపేశారు. మరికొందరు తెలుగు అభిమానులు ఈ బ్యూటీని తమ ఆల్‌టైమ్ ఫేవరెట్ `చిరుత` హీరోయిన్‌గా గుర్తుచేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

వీడియో వెనుక ఉన్న `దారు బద్నామ్` పాట సారాంశం కూడా నేహా శర్మ అందానికి సరిగ్గా సరిపోతుంది. మద్యం మత్తు కంటే ఒక అందమైన అమ్మాయి చూపుల్లోని మత్తే యువకులను ఎక్కువగా మైకంలో ముంచెత్తుతుందని ఈ పాటలో సరదాగా వర్ణిస్తారు. సరిగ్గా అదే విధంగా ఈ వైరల్ వీడియోలో నేహా శర్మ తన గ్లామర్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.



Tags:    

Similar News