హోదాని త‌ల‌కెక్కించుకుంటే కెరీర్ క్లోజ్!

సినీ పరిశ్రమలో విజయం అనేది డబ్బుతోనే రాదు. క్రమశిక్షణ - పని పట్ల ఉండే వినయంపై ఆధారపడి ఉంటుందని నటి, నిర్మాత నేహా పెండ్సే అభిప్రాయపడ్డారు.;

Update: 2026-04-13 12:30 GMT

సినీ పరిశ్రమలో విజయం అనేది డబ్బుతోనే రాదు. క్రమశిక్షణ - పని పట్ల ఉండే వినయంపై ఆధారపడి ఉంటుందని నటి, నిర్మాత నేహా పెండ్సే అభిప్రాయపడ్డారు. నిర్మాత అనే హోదాను తలకెక్కించుకుంటే కెరీర్ ముగిసిపోవడానికి ఎంతో సమయం పట్టదని హెచ్చరించారు. తన నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నప్పుడు తాను ఎప్పుడూ ఒక బాధ్యతాయుతమైన పని మనిషిలాగే ఆలోచిస్తానంది. నేనే బాస్ అనే అహంకారం తన దరిచేరనివ్వనని స్పష్టం చేశారు. ఒక సినిమా విజయవంతం కావాలంటే సెట్స్‌లో ఉండే వాతావరణం చాలా ముఖ్యం.

నిర్మాతకు గర్వం ఉంటే? అది సినిమా నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నేహా అభిప్రాయ‌ప‌డింది. నేను నిర్మాతను కదా అని సెట్‌కు ఆలస్యంగా వెళ్లడం లేదా ఇతరులను తక్కువ చేసి చూడటం వంటి పనులు చేస్తే సృజనాత్మకత నశిస్తుంది. ఎప్పుడైతే మనం ఇతరుల సమయాన్ని, కష్టాన్ని గౌరవిస్తామో, అప్పుడే అందరూ మన ప్రాజెక్ట్ కోసం మనస్ఫూర్తిగా పని చేస్తారు అని పేర్కొన్నారు. నేహా పెండ్సే దృష్టిలో నిర్మాత అనే వ్యక్తి కేవలం పెట్టుబడిదారుడు మాత్రమే కాదు. ఒక సమన్వయకర్త. సెట్‌లో ఉండే ప్రతి టెక్నీషియన్ నుండి నటుల వరకు అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత నిర్మాతపై ఉంటుంది.

ఆ సమయంలో హోదాని పక్కన పెట్టి అందరితో కలిసి పనిచేస్తేనే నాణ్యమైన అవుట్‌పుట్ వస్తుందని ఆమె నమ్ముతారు. ఏ పరిశ్రమలోనైనా నిర్మాతలు వినయంగా ఉన్నప్పుడే ఆ నిర్మాణం సులభంగా , తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని వివరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు దారితీస్తాయి. నిర్మాతలకు ఉండే అతి గర్వం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేక చాలా మంది తమ కెరీర్‌ను మధ్యలోనే ముగించుకున్న సందర్భాలు ఉన్నాయని నేహా గుర్తు చేశారు.

అందుకే తాను ఎంత ఎదిగినా? ఒదిగి ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానన్నారు. సెట్‌లో అందరిలాగే తాను కూడా సాధారణంగా ఉండటానికే ఇష్టపడతాన‌న్నారు. ఈ ప్రవర్తనే తనను ఒక విజయవంతమైన నిర్మాతగా తీర్చిదిద్దు తోందని ధీమా వ్యక్తం చేశారు. నేహా పెండ్సే మాటలు నేటి తరం యువ నిర్మాతలకు ఒక పాఠం లాంటివి. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగకుండా? వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటేనే సినిమా రంగంలో సుదీర్ఘ కాలం మనుగడ సాగించొచ్చు. నటిగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన నేహా ఇప్పుడు నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని ఏర్పరచుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె ఆలోచనా ధోరణి పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

Tags:    

Similar News