• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నీల్ పర్ఫెక్ట్ ప్లాన్.....

నీల్ పర్ఫెక్ట్ ప్లాన్.. తారక్ తో ఇబ్బంది లేకుండా..

| కేజీఎఫ్ చాప్టర్ 2 రేంజ్ సక్సెస్ కాకున్నా ప్రశాంత్ నీల్ స్టామినాని మరోసారి సలార్ పరిచయం చేసింది.

By - Tupaki Desk
Update: 2024-01-23 02:30 GMT

సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ గత ఏడాది టాలీవుడ్ కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. హైయెస్ట్ కలెక్షన్స్ మూవీని కూడా అందించాడు. అలాగే డార్లింగ్ కి చాలా రోజుల నుంచి ఊరిస్తున్న సక్సెస్ రుచి చూపించాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ మూడు సినిమాలు చేస్తే అవేవీ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. సలార్ మాత్రం ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. కేజీఎఫ్ చాప్టర్ 2 రేంజ్ సక్సెస్ కాకున్నా ప్రశాంత్ నీల్ స్టామినాని మరోసారి సలార్ పరిచయం చేసింది.

సలార్ పార్ట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించడానికి కూడా సిద్ధమై ఉంది. అయితే సలార్ థియేటర్స్ లోకి వచ్చేసరికి ఎన్టీఆర్ మాత్రం దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతోంది.

దేవర షూటింగ్ కంప్లీట్ కాగానే హిందీలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వార్ 2 షూటింగ్ లో తారక్ జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు తారక్ కాల్ షీట్స్ దొరకడం కష్టం. అంటే ఎన్టీఆర్ తో మూవీ చేయాలంటే కచ్చితంగా ఏడాది కాలం వెయిట్ చేయాల్సిందే.

అందుకే ప్రశాంత్ నీల్ ఈ టైంలో సలార్ 2 అయిన శౌర్యంగ పర్వం పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ కి కూడా ప్లానింగ్ చేసేసాడు. త్వరలో పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం ఉందంట. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు మారుతి రాజాసాబ్ మూవీ పూర్తి చేయాలి. దాంతో పాటు ఈ సలార్ కి కూడా డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ ఏడాదిలోనే ఫినిష్ చేయాలనే ఆలోచనతో ఉన్నారంట.

స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కావడానికి మరో ఆరు నెలల సమయం పట్టొచ్చు ఆ లోపు పెండింగ్ షూటింగ్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలని డార్లింగ్ అనుకుంటున్నారని తెలుస్తోంది. సలార్ షూటింగ్ కూడా వీలైనంత వేగంగా ఫినిష్ చేసేయాలని డిసైడ్ అయినట్లు బోగట్టా.

Tags:    
  • Kgf 
  • Salaar 
  • Prabhas 
  • Prashanthneel 
  • War2 
  • Hrithikroshan 
  • Ntr 
  • Ayanmukerji 

Similar News

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!

2026-11-07 06:47 GMT

Tupaki Exclusive : నాగార్జున ఎందుకు ప్రెజెంట్ చేశారు? అనీష్ ఓపెన్ చాట్

2026-11-07 06:12 GMT

Copyright @2026

Powered by Blink CMS