ద‌శాబ్దం త‌ర్వాత షెకావ‌త్ సతీమ‌ణి!

మ‌ల‌యాళం బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ పెళ్లైన ద‌గ్గ‌ర నుంచి సెల‌క్టివ్ గానే సినిమాలు చేస్తోంది.;

Update: 2025-09-03 13:30 GMT

మ‌ల‌యాళం బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ పెళ్లైన ద‌గ్గ‌ర నుంచి సెల‌క్టివ్ గానే సినిమాలు చేస్తోంది. అంటే దాదాపు ద‌శాబ్దం పాటు న‌జ్రియా తెర‌పై క‌నిపించిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. 2014 నుంచి ఇప్ప‌టి వర‌కూ ఐదు సినిమాలు మాత్ర‌మే చేసింది. ఈ క్ర‌మంలోనే `అంటే సుంద‌రానికి` అనే చిత్రంతో తెలుగులో లాంచ్ అయింది. ఈ సినిమా త‌ర్వాత తెలుగులో బిజీ అవుతుంద‌నుకున్నారు కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా సైన్ చేయ‌లేదు. కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసి ద‌శాబ్దం పూర్త‌యింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా న‌జ్రియా న‌జీమ్ కి హీరోయిన్ గా ఓ అవ‌కాశం వ‌చ్చింది. స్టార్ హీరో సూర్య 47వ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. మాయ‌లాళ ద‌ర్శ‌కుడు జీతూ జోసెప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర మిది. దీంతో న‌జ్రియాకు అవ‌కాశం ఈజీ అయింది. న‌జ్రియా కూడా మ‌ల‌యాళీ కావ‌డంతో సూర్య స‌ర‌స‌న ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి న‌జ్రియా కూడా ఈ మ‌ధ్య‌ మాలీవుడ్ లో కూడా పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. మ‌రి అక్క‌డ ఛాన్సులు వ‌చ్చినా న‌టించ‌లేదా? రాక న‌టించ‌లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ పెళ్లైన త‌ర్వాత మాత్రం జోరు త‌గ్గిన మాట వాస్త‌వం.

మొత్తంగా 2014 నుంచి 2024 మ‌ధ్య‌లో రెండేళ్ల గ్యాప్ లో ఐదు సినిమాలు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది. తాజాగా సూర్య సినిమాలో ఛాన్స్ రావ‌డంతో అమ్మ‌డు సంతోషం వ్య‌క్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్ర‌ధాన తారాగ‌ణం ఎంపిక ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. మరి ఈ సినిమాతోనైనా న‌జ్రియా మ‌ళ్లీ న‌టిగా బిజీ అవుతుందా? అన్న‌ది చూడాలి. న‌టిగా మాత్రం మంచి అవ‌కాశం ఇది.

సాధార‌ణంగా ఏ న‌టికైనా కెరీర్ లో ఇంత లాంగ్ గ్యాప్ వ‌స్తే అవ‌కాశాలు రావ‌డం క‌ష్టం. ఏ డైరెక్ట‌ర్ అయినా ఫాంలో ఉన్న హీరుయిన్ల‌నే తీసుకుంటారు. కానీ జీతూ మాధ‌వ‌న్ సొంత ప‌రిశ్ర‌మ‌కు చెందిన ద‌ర్శ‌కుడు కావ‌డంతో? కాస్త రిస్క్ అయినా ఎంపిక చేసాడు. పాత్ర‌కు సంబంధించి ఇప్పటికే న‌జ్రియాతో చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి. రోల్ న‌చ్చ‌డంతో న‌జ్రియా కూడా మ‌రో మాట లేకుండా అంగీక‌రించిన‌ట‌లు తెలుస్తోంది.

Tags:    

Similar News