40 దాటిన తర్వాత నెంబర్ వన్ గా!
ఏ నటికైనా వయసుతో పాటు, అవకాశాలు తగ్గుతుంటాయి. దర్శక, నిర్మాతలు, హీరోలు కొత్త భామల వైపు చూస్తుం టారు. సినిమాకు కొత్త ఫేస్ అయితే ఫ్రెష్ ఫీలింగ్ అందించగల్గుతామని భావిస్తారు.;
ఏ నటికైనా వయసుతో పాటు, అవకాశాలు తగ్గుతుంటాయి. దర్శక, నిర్మాతలు, హీరోలు కొత్త భామల వైపు చూస్తుం టారు. సినిమాకు కొత్త ఫేస్ అయితే ఫ్రెష్ ఫీలింగ్ అందించగల్గుతామని భావిస్తారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో మాత్రం దర్శక, నిర్మాతలు అలాంటి ఆలోచన లేకుండా పని చేస్తారనిపిస్తుంది. అలా కాకపోతే నయనతారతో పాటు చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు. ఆమె తర్వాత వచ్చిన వాళ్లుకూడా చా మంది ఉన్నారు. వారిలో కొంత మంది సినిమాల నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. వయో భారంతో అవకాశాలకు దూరమైన వారు మరికొంత మంది.
అదృష్టమో..మరోటో కలిసి రాక ఛాన్సులందకోలేని వారి ఇంకొంత మంది. నయనతారతో పాటు త్రిష, కాజల్ అగర్వాల్ , తమన్నా లాంటి వారు కూడా ఫాంలో ఉన్నంత కాలం ఎలా కొనసాగారో తెలిసిందే? కానీ ఇప్పుడు వారికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అప్పుడప్పుడు అవకాశం వస్తే తెరపై కనిపించడం లేదంటే ఏదో యాడ్ లో నటించడం తప్ప హీరోయిన్లగా మాత్రం మునుపటిలా కొనసాగలేదు. కానీ నయనతార ప్రయాణం మాత్రం వారికి భిన్నంగా సాగుతోంది. ఇప్పటికే అమ్మడి వయసు 40 ఏళ్లు దాటింది. కానీ ఛాన్సులు అందుకోవడంలో తనకి తానే సాటి అనిపిస్తోంది.
అంతేనే అందుకు తగ్గట్టు భారీగా పారితోషికం కూడా అందుకుంటోంది. ఒక్కో సినిమాకు కొన్ని కోట్లు ఛార్జ్ చేస్తూ సౌత్ లో ఇంకా తానే నెంబర్ వన్ గా కొనసాగుతోంది. కొంత కాలంగా తమిళ సినిమాలు మినహా తెలుగులో సెలక్టివ్ గా ఉంటుంది. సీనియర్ హీరోలతోనే ఎక్కువగా నటిస్తోంది. తర్వాత తరం హీరోలతో అవకాశాలు రావడం లేదా? తానే నో చెబుతుందా? అన్నది తెలియదు గానీ సీనియర్లతో అవకాశం వచ్చిందంటే మాత్రం నో చెప్పకుండా పని చేస్తోంది. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తోంది. ఆ రకంగా నయనతారను ప్రశంశించొచ్చు.
బాలయ్య, చిరంజీవి సినిమాలకు ఏ డైరెక్టర్ అప్రోచ్ అయినా పాత్ర నచ్చిందంటే వైనాట్ అంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `మన శంకరవరప్రసాద్ గారు`లో నటిస్తోంది. సినిమా ప్రచారానికి దూరంగా ఉండే నయనతార ఈ సినిమా ప్రచారంలో ఎంత యాక్టివ్ గా పాల్గొంటుందో తెలిసిందే. సినిమా లాంచ్ అయిన దగ్గర నుంచి ముగింపు వరకూ అనీల్ అడగాలే గానీ.. కాదనకుండా ప్రచారానికి పూర్తి స్థాయిలో సహక రిస్తుంది. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నయనతార కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవ్.