• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయన్ కు చంద్రముఖి మేకర్స్...

నయన్ కు చంద్రముఖి మేకర్స్ షాక్.. రూ.5 కోట్లు చెల్లించాలని నోటీసులు

| ఇప్పుడు డాక్యుమెంటరీలో రజినీకాంత్ తో నయన్ కలిసి నటించిన చంద్రముఖి మూవీ సీన్స్ ఉండగా. ఆ సినిమా మేకర్స్ స్పందించారు.

By - Tupaki Desk
Update: 2025-07-08 13:27 GMT

స్టార్ హీరోయిన్ నయనతార నిజ జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్.. నయనతార: బియాండ్ ది డ్రీమ్స్ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. 2024 నవంబర్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీతో నయనతార మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. డాక్యుమెంటరీపై కోర్టును ఆశ్రయించారు. తన పర్మిషన్‌ తీసుకోకుండా నానుమ్‌ రౌడీ దాన్‌ ఫుటేజ్‌ ను ఉపయోగించారని లీగల్‌ నోటీసులు పంపించారు. మూడు సెకన్ల క్లిప్‌ కోసం రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆ సినిమాను ఆయనే నిర్మించారు. ఆ కేసు విచారణలో ఉంది.

ఇప్పుడు డాక్యుమెంటరీలో రజినీకాంత్ తో నయన్ కలిసి నటించిన చంద్రముఖి మూవీ సీన్స్ ఉండగా. ఆ సినిమా మేకర్స్ స్పందించారు. తమ అనుమతులు లేకుండా సీన్స్ యాడ్ చేశారని తెలిపారు. వాటిని తొలగించాలని ఇప్పటికే నోటీసులు పంపినా స్పందించలేదట. దీంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

చంద్రముఖి సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆ మూవీ కాపీరైట్‌ పొందిన ఏబీ ఇంటర్నేషనల్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేసింది. రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ పిటిషన్ ను మద్రాసు హైకోర్టు విచారించింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. డాక్యుమెంటరీ విడుదల చేసిన తర్వాత ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

కాగా, నయన్ అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయానికొస్తే.. ఇప్పుడు అమ్మడు భారీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. స్టార్ హీరో యష్ టాక్సిక్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మోహన్ లాల్ లీడ్ రోల్ నటిస్తున్న పేట్రియాట్ లో కనిపించనున్నారు.

రక్కాయి, మూకుతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న మెగా 157లో కూడా భాగమయ్యారు. ఇప్పటికే ఆ మూవీ చిత్రీకరణ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. మరి అప్ కమింగ్ మూవీస్ తో నయన్ ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    
  • Nayanthara 
  • NayantharaDocumentary 
  • Netflix 
  • LegalBattle 
  • Kollywood 
  • Chandramukhi 
  • NanumRowdyDaan 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS