గోవా ట్రిప్‌లో అల్లు వారి కోడ‌లు మ‌ర‌పురాని జ్ఞాప‌కాలు

మెగా - అల్లు కుటుంబ సభ్యుల సోషల్ మీడియా పోస్టులకు నెటిజనుల్లో ఎప్పుడూ ఉండే క్రేజ్ వేరు.

Update: 2026-07-18 04:00 GMT

మెగా - అల్లు కుటుంబ సభ్యుల సోషల్ మీడియా పోస్టులకు నెటిజనుల్లో ఎప్పుడూ ఉండే క్రేజ్ వేరు. తాజాగా అల్లు వారి కోడ‌లు నయనిక రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన‌ ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. గోవా ట్రిప్ కోసం కొన్ని రోజుల పాటు స‌రిప‌డేలా బట్టలను ప్లాన్ చేసుకునే క్రమంలో తన ఫోన్ గ్యాలరీని వెతుకుతుండగా... గత 2013 నుంచి తాను గోవా వెళ్తున్న పాత మధురమైన జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయని న‌య‌నిక వెల్ల‌డించారు. ``#గోవా టూర్ రిపీట్‌.. 2013 నుంచి లెక్క‌పెడుతున్నాను!`` అనే పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.




ఈ పోస్ట్‌పై మెగా, అల్లు హీరోలతో పాటు పలువురు సెలబ్రిటీలు - అభిమానులు క్రేజీగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా భార్య న‌య‌నిక పోస్ట్ పై అల్లు శిరీష్ స్పందిస్తూ.. అందులోని 2వ వీడియో ఈ రోజుకు బెస్ట్ వీడియో అంటూ... ఎంతో ముద్దుగా ఉందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాగే మరికొందరు స్నేహితులు గోవా ట్రిప్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కామెంట్లు పెట్టగా.. అభిమానులు `బ్యూటిఫుల్ జంట`, `క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్` అంటూ నయనిక రెడ్డిని, శిరీష్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.




అయితే ఈ పోస్ట్‌కు వచ్చిన కామెంట్లలో ఉపాసన కొణిదెల డ్రెస్సింగ్ స్టైల్ తో న‌య‌నిక డ్రెస్ సెల‌క్ష‌న్ గురించి ప్రస్తావించ‌డం విశేషం. నయనిక రెడ్డి డ్రెస్సింగ్ - లుక్స్ కూడా ఎంతో స్టైలిష్‌గా, ఒక హీరోయిన్‌లా ఉన్నాయంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కొందరు అభిమానులు న‌య‌నిక‌ను త‌న కోసిస్ట‌ర్ శాలినీ కందుకూరి (నితిన్ భార్య) తో.. అలాగే ఉపాసన కొణిదెల డ్రెస్సింగ్ సెన్స్‌తో పోలుస్తూ.. వారి మధ్య ఉన్న బాండింగ్ .. ఐకానిక్ కో-సిస్టర్స్ రిలేషన్‌ను అభినందిస్తూ కామెంట్లు సెక్షన్‌ను నింపేస్తున్నారు.




ఇలాంటి సెలబ్రిటీ పోస్టులకు ఉండే క్రేజ్‌తో పాటు... కొందరు నెటిజన్లు వింత వింతగా కామెంట్లు చేయడం కూడా సోషల్ మీడియాలో సాధారణంగా మారిపోయింది. ఈ పోస్ట్ కింద కూడా ఒక నెటిజన్ ``అక్కా నాకు ఐఫోన్ 17 ప్రో మాక్స్ గిఫ్ట్ ఇవ్వవా`` అంటూ పదే పదే అమాయ‌కంగా కామెంట్స్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సినిమా ఇండస్ట్రీలో మీకు మంచి అవకాశాలు వస్తాయంటూ కొందరు నయనికకు సలహాలు కూడా ఇస్తున్నారు.

నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ కొన్ని ఉన్నా.. మెజార్టీ నెటిజన్లు మాత్రం నయనిక రెడ్డి షేర్ చేసిన 11వ ఫోటో...ట్రావెల్ వీడియోలు చాలా క్యూట్‌గా ఉన్నాయంటూ హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. అల్లు శిరీష్ కూడా కామెంట్ చేయడంతో ఈ గోవా మెమొరీస్ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్ సోషల్ మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

Tags:    

Similar News