• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు యంగ్‌ స్టార్‌ కి...

తెలుగు యంగ్‌ స్టార్‌ కి ఫాల్కే పురస్కారం

| మంత్‌ ఆఫ్ మధు సినిమాలో అద్భుతమైన నటనకు గాను ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఉత్తమ నటుడిగా అవార్డును నవీన్‌ చంద్ర అందుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-05-01 11:26 GMT

అందాల రాక్షసి సినిమాలో సూర్య పాత్రలో నటించడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్‌ స్టార్‌ నవీన్‌ చంద్ర. నటుడిగా ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నవీన్ చంద్ర కు ఆ తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కేవలం హీరోగానే నటించాలనే ఉద్దేశ్యం పెట్టుకోకుండా విలన్ గా కూడా సినిమాలు చేశాడు.

సినిమాల్లో హీరోగా, విలన్‌ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ వస్తున్న నవీన్ చంద్రకు తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈయన మంత్‌ ఆఫ్ మధు అనే సినిమాలో నటించడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ సినిమాలోని నటనకు గాను నవీన్ చంద్ర విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.

మంత్‌ ఆఫ్ మధు సినిమాలో అద్భుతమైన నటనకు గాను ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఉత్తమ నటుడిగా అవార్డును నవీన్‌ చంద్ర అందుకున్నాడు. ఈ అవార్డు నవీన్‌ చంద్రకు రావడం పట్ల యూనిట్‌ సభ్యులతో పాటు ఆయన సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.

ఫాల్కే అవార్డు పురస్కారంపై నవీన్ చంద్ర స్పందిస్తూ.. ఒక గొప్ప గౌరవం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. కంటెంట్‌ ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తూ ఉన్నాను. ఫలితాలపై ఎక్కువ పట్టింపు లేకుండా నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.

మంత్‌ ఆఫ్ మధు సినిమా అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మధ్య కాలంలో వరుసగా డిజిటల్‌ సినిమాలు మరియు సిరీస్ ల్లో నవీన్ చంద్ర కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ముందు ముందు మరిన్ని అవార్డులను అందుకోవాలని కోరుకుంటూ కంగ్రాట్స్ నవీన్ చంద్ర.

Tags:    
  • Naveenchandra 
  • Dadasaheb 
  • Phalkeaward 
  • Hero 
  • Villain 
  • Monthofmadhu 
  • Amazonprimevideo 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS