విమానాశ్ర‌యాల‌ను వ‌దిలిపెట్ట‌ని పోలిశెట్టి

ఫిలింఛాంబ‌ర్, ప్ర‌సాద్ లాబ్స్ లేదా ఏదైనా 5 న‌క్ష‌త్రాల హోట‌ల్ బాంకెట్ హాల్ బుక్ చేసి సినిమాల‌కు ప్ర‌చారం చేసే రోజులు పోయాయి;

Update: 2026-01-13 03:54 GMT

ఫిలింఛాంబ‌ర్, ప్ర‌సాద్ లాబ్స్ లేదా ఏదైనా 5 న‌క్ష‌త్రాల హోట‌ల్ బాంకెట్ హాల్ బుక్ చేసి సినిమాల‌కు ప్ర‌చారం చేసే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఓపెన్ టాప్ ప్ర‌మోష‌న్లే. రొటీనిటీని బ్రేక్ చేయ‌డానికి నేటి జెన్ జెడ్ హీరోలు ఇష్ట‌ప‌డుతున్నారు. ప్ర‌మోష‌న్‌లోను ప్ర‌యోగాల‌కు ఏమాత్రం వెన‌కాడ‌టం లేదు.

ఇప్పుడు యంగ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి విమానాశ్ర‌యాల‌ను కూడా విడిచిపెట్ట‌డం లేదు. తాజాగా పోలిశెట్టి విమానాశ్రయంలో సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌కు వస్తున్న త‌న‌ చిత్రం `అనగనగా ఒక రాజు` ప్ర‌మోష‌న్స్ కోసం ఆయన విమానాశ్రయంలో చేసిన హంగామా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నవీన్ పోలిశెట్టి .. యాంకర్ సుమ కనకాలకు విమానాశ్ర‌యంలోనే బిగ్ షాకిచ్చాడు. పోలిశెట్టి ఇక్క‌డ కూడా వ‌దిలి పెట్ట‌వా? అంటూ సుమ అత‌డి ప్ర‌మోష‌న‌ల్ ఫోబియో గురించి ప్ర‌శ్నిస్తుంటే, ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఫ‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంది.

ఎయిర్‌పోర్ట్‌లో సుమను చూసిన నవీన్, తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ అక్కడున్న వారిని నవ్వించారు. ఈ వీడియోలను `అనగనగా ఒక రాజు` ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ షేర్ చేసింది. నవీన్ ఎక్కడ ఉన్నా అక్కడ నవ్వులు పూయిస్తారని ఈ వీడియోలు మరోసారి నిరూపించాయి.

ఇక విమానాశ్ర‌యంలో నవీన్ పోలిశెట్టి చాలా కూల్ గా, స్టైలిష్‌గా కనిపించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ప్ర‌యాణ స‌మ‌యాల్లో సీరియస్‌గా క‌నిపిస్తుంటారు. కానీ నవీన్ మాత్రం అభిమానులతో సెల్ఫీలు దిగుతూ.. అందరినీ పలకరిస్తూ సందడి చేశారు. 14 జ‌న‌వ‌రి సంక్రాంతి కానుక‌గా మా సినిమా విడుద‌లవుతోంది! అంటూ ఎలాంటి భేష‌జం లేకుండా ప్ర‌మోష‌న్స్ చేసుకున్నాడు. రిలీజ్ ముందు పోలిశెట్టి చాలా శ్ర‌మిస్తున్నాడు. తన సినిమా ప్రమోషన్ల కోసం పెద్ద‌ నగరాలకు ప్రయాణిస్తున్నారు.

ఈ చిత్రంలో నవీన్ ఒక విలేజ్ రిచ్ బాయ్ (రాజు) పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. అత‌డి స‌ర‌స‌న‌ అందాల‌ మీనాక్షి చౌదరి హీరోయిన్‌. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దీనికి కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ అందించడం అదనపు ఆకర్షణ. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విజయాల తర్వాత నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై చ‌క్క‌ని అంచనాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఆయన చూపించిన ఉత్సాహం చూస్తుంటే, ఈ సంక్రాంతి బ‌రిలో న‌వ్వుల ధ‌మాకా అందిస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది.




Tags:    

Similar News