• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జెర్సీ 2.. నాని...

జెర్సీ 2.. నాని ఏమన్నాడంటే..

| గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా హిందీలో కూడా రీమేక్ అయిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-04-22 16:50 GMT

నాని కెరీర్ లో ఎన్ని బాక్సాఫీస్ హిట్ సినిమాలు ఉన్నా కూడా అందులో ఓ వర్గం ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చే ఎమోషనల్ మూవీ జెర్సీ అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. నానిలోని సరికొత్త నటుడిని ఈ సినిమా తెరపై ఆవిష్కరించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా హిందీలో కూడా రీమేక్ అయిన విషయం తెలిసిందే.

అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే దారుణంగా డిజాస్టర్ అయింది. ఇక ఫలితం ఎలా ఉన్నా కూడా నాని కెరియర్ లో అది ఒక బెస్ట్ సినిమా అని చెప్పవచ్చు. ఇక అలాంటి సినిమాకు సీక్వెల్ చేస్తే కూడా బాగుంటుంది అనే కామెంట్లు చాలాసార్లు వచ్చాయి. ఆ విషయంపై ఇటీవల ఫ్యాన్స్ డైరెక్ట్ గా నానినే అడిగారు.

అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాని పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక అందులో నాని మాట్లాడుతూ ఉండగా ఫ్యాన్స్ అందరూ కూడా జెర్సీ 2 ఎప్పుడు అంటూ గట్టిగా అరిచేశారు. ఇక నాని మాత్రం ఎవరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చాడు. అందులో నేను లేనుగా.. అయిపోయింది! ఇప్పుడు ఎవరితో చేసుకుంటారో చేసుకోండి.. అని సరదాగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

నిజంగా నాని చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. అందులో అర్జున్ పాత్రలో నాని కనిపించాడు. ఆ క్యారెక్టర్ క్లైమాక్స్ లో చనిపోతుంది. క్రికెట్ ఆడితే చనిపోతావు అని తెలిసిన కూడా కొడుకు దృష్టిలో హీరో అవ్వడం కోసం మళ్ళీ క్రికెట్ బాట పడతాడు. ఇక అతను ఆ క్యారెక్టర్ లో కనిపించిన విధానం ఆడియన్స్ కు ఎంతగానో కనెక్ట్ అయింది. అయితే ఆ తర్వాత కొడుకు తండ్రి జీవితం గురించి చెబుతుండగా సినిమా ఎండ్ అవుతుంది.

కాబట్టి మళ్ళీ సీక్వెల్ అంటే కథలో నాని ఏ విధంగా కనిపిస్తాడు అనేది అసలు ప్రశ్న. దర్శకుడు కూడా జెర్సీ సీక్వెల్ అనే అంశంపై పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు కొత్త తరహా కథతో ఏమైనా సర్ ప్రైజ్ చేస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం అయితే దర్శకుడు గౌతమ్ విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నాని 'సరిపోదా శనివారం' అనే సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

Tags:    
  • Naturalstar 
  • Nani 
  • Jerseymovie 
  • Jersey2 
  • Tollywood 
  • Aaokkatiadakku 
  • nanijersey 
  • Filmindustry 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS