• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రష్మిక, విజయ్ ఫోటోపై నాని...

రష్మిక, విజయ్ ఫోటోపై నాని క్లారిటీ

| నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా హాయ్ నాన్న

By - Tupaki Desk
Update: 2023-12-03 08:22 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ అంతా నాని తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మృణాల్ ఠాకూర్ తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వలన ఎక్కువ సమయం ఈ మూవీ ప్రమోషన్స్ కి కేటాయించలేకపోయిందని నాని క్లారిటీ ఇచ్చారు. కాని ఆమె పెర్ఫార్మెన్స్ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుందని, ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ లో ఆమె యాక్టింగ్ కి ఫిదా అయిపోయానని అన్నారు. ఇక సినిమాకు మ్యూజిక్ అందించిన హేసమ్ అబ్దుల్ వాహబ్ కచ్చితంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని కొనియాడారు.

దర్శకుడు శౌర్యువ్ కి మంచి టాలెంట్ ఉందని, ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అతని సామర్ధ్యాన్ని గుర్తిస్తారని అన్నారు. సినిమా ప్రమోషన్స్ భాగంగా ఓ పొలిటికల్ ఇంటర్వ్యూలో నేచురల్ స్టార్ నాని చేశారు. ఇది కాస్తా సెటైరికల్ గా అనిపించిన భాగా వైరల్ అయ్యింది. అయితే రాజకీయాన్ని ఇలా సినిమాకి వాడుకోవడంపై నాని క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం పొలిటికల్ సీజన్ అంతా నడుస్తుందని, ఈ టైంలో ఎలాంటి ప్రమోషన్స్ చేసిన జనం దృష్టి మన మీద పడదు. ఈ నేపథ్యంలోనే యూనిట్ ఆలోచనతో ఈ పొలిటికల్ ప్రెస్ మీట్ వీడియో షూట్ చేసి విడుదల చేశామని అన్నారు. అయితే ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం తమకి లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో రష్మిక, విజయ్ పర్శనల్ ఫోటోలు చూపించడం పొరపాటుగా జరిగిందని అన్నారు.

ఆ ఫోటోలని అలా చూపించకుండా ఉండాల్సిందని, నిర్వాహకులు పొరపాటుగా అలా చేసారని, దానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన హర్ట్ అయితే సారీ చెబుతున్నట్లు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Tags:    
  • Nani 
  • Vijaydevarakonda 
  • Rashmika 
  • Filmindustry 
  • HiNanna 
  • Mrunal 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS