టాక్సిక్: ఎవరీ నటాలీ బర్న్.. కార్ సీన్ తో భారీ క్రేజ్.. బ్యాక్ గ్రౌండ్ ఇదే!
ఒక్క కారు సన్నివేశంతో వెలుగులోకి వచ్చిన ఈమె సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది అని చెప్పవచ్చు.;
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ నటుడు యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ మూవీ నుండి హీరో పుట్టినరోజు సందర్భంగా హీరో ఇంట్రడక్షన్ వీడియో విడుదల చేశారు ఇందులో యష్.. రాయ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన హీరో ఇంట్రడక్షన్ వీడియోలో యష్ ఒక విదేశీ నటితో కలిసి నటించిన కారు సీను వైరల్ అవుతోంది. పైగా ఆ విదేశీ నటి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే ఈమె ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అసలు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. మరి ఈమె ఎవరు? ఈమె నేపథ్యం ఏమిటి? ఇలా పలు విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.
ఒక్క కారు సన్నివేశంతో వెలుగులోకి వచ్చిన ఈమె సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది అని చెప్పవచ్చు. ఈమె పేరు నటాలీ బర్న్. ఉక్రెయిన్- అమెరికన్ నటి. 2006 నుండి హాలీవుడ్ చిత్రాలలో పనిచేస్తోంది. ఉక్రెయిన్ లోని కైవ్ లో నటాలీయ గుస్లిష్ఠాయాగా జన్మించింది. ఇక సినిమాల మీద ఇష్టంతో అమెరికాకు వెళ్ళిపోయిన ఈమె.. అక్కడే సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది. ది ఎక్స్ పెండబుల్స్ 3, మెకానిక్ రిసరెక్షన్ వంటి యాక్షన్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ది కం బ్యాక్ ట్రైల్, ఐస్ ఇన్ ది ట్రీస్ వంటి థ్రిల్లర్ చిత్రాలలో కూడా నటించి ఆకట్టుకుంది.
ఇకపోతే ఈమె నటి మాత్రమే కాదు నిర్మాతగా, మార్షల్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు దక్కించుకుంది. ప్రస్తుతం కన్నడ చిత్రమైన టాక్సిక్ సినిమాలో నటాలీ బర్న్ నటించడమే కాకుండా సహానిర్మాతగా కూడా పనిచేస్తోంది. ఇకపోతే నిర్మాతగా ఇప్పటికే పలు చిత్రాలను నిర్మించిన ఈమె అటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా మంచి శిక్షణ పొందింది. పైగా నాలుగు భాషలు కూడా మాట్లాడగలదు. ఇకపోతే తొలిసారి ఇండియన్ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
టాక్సిక్ సినిమా విషయానికి వస్తే..క్రిటికల్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఇప్పుడు తొలిసారి కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గీతూ మోహన్ దాస్. తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. కన్నడ, ఇంగ్లీష్ భాషలలో ఒకేసారి విడుదలవుతోంది. అలాగే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో డబ్ వెర్షన్లలో విడుదల కాబోతోంది. ఇందులో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా , హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది..