• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆయ్' మేం ఫ్రెండ్సండీ.....

'ఆయ్' మేం ఫ్రెండ్సండీ.. ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే..

| ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్.. మ్యాడ్ మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో నితిన్ కొత్త సినిమాలపై మూవీ లవర్స్ దృష్టి పడింది

By - Tupaki Desk
Update: 2024-03-07 08:07 GMT

ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్.. మ్యాడ్ మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో నితిన్ కొత్త సినిమాలపై మూవీ లవర్స్ దృష్టి పడింది. ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతున్న ఆయ్ చిత్రంలో నార్నే నితిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఫన్ ఎంటర్టైనర్ గా ఆయ్ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ టైటిల్ రివీల్ కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. తాజాగా మేకర్స్.. ఆయ్ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఆయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో నార్నే నితిన్ తన ఫ్రెండ్స్ తో కనిపిస్తున్నారు. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ ఇందులో హీరో ఫ్రెండ్స్ పాత్రల్లో యాక్ట్ చేశారు. సరస్సును కూడా చూపిస్తున్నారు. అయితే ఈ మూవీలో న్యాచుర్.. కీలకం కానున్నట్లు తెలుస్తోంది. మ్యాడ్ మూవీ లాగే ఆయ్ కూడా మంచి యూత్‌ ఫుల్ స్టోరీ అని అర్థమవుతోంది.

సాధారణంగా గోదావరి ప్రాంతవాసులు వాడే పదం ఆయ్. గోదావరి నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. ఈ మూవీ వేసవి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. డ్రిజ్ లింగ్ సమ్మర్ అంటూ రిలీజ్ మ్యాటర్ ను పస్ట్ లుక్ పోస్టర్ లో కూడా తెలిపారు. అయితే ఈ పోస్టర్.. అందరినీ ఆకట్టుకుంటూ.. ఆయ్ మూవీ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం.. కచ్చితంగా సినీ ప్రియులను మెప్పిస్తుందనే ధీమాతో ఉన్నారు ఆయ్ మేకర్స్. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో అత్యుత్తమమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేశారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌ గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌ గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.

Tags:    
  • Anjikanchipally 
  • Vidyakoppineedi 
  • Bunnyvas 
  • Tollywood 
  • AAYmovie 
  • Narnenithin 
  • Rajkumarkasireddy 
  • AAYfirstlook 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS