• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'బచ్చల మల్లి' టీజర్.. ఊర...

'బచ్చల మల్లి' టీజర్.. ఊర మాస్ నరేష్

| టీజర్ ప్రకారం.. బచ్చల మల్లి మూవీలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత మాస్ లుక్‌ లో నరేష్ కనిపించనున్నారని అర్థమవుతోంది. ఫుల్ గా గడ్డంతో చాలా ఆయన లుక్ రగ్డ్ గా ఉంది.

By - Tupaki Desk
Update: 2024-11-28 12:35 GMT

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగాదేవి తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీని హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.

 

ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై పాజిటివ్ బజ్ బాగానే క్రియేట్ అయింది. పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్.. అన్నీ అలరించాయి. అదే జోష్ తో తాజాగా మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. బచ్చల మల్లి మండుతున్న ఫైరీ స్పార్క్ అంటూ క్యాప్షన్ ఇవ్వగా.. ప్రస్తుతం టీజర్ నెట్టింట వైరల్ గా మారింది.

ఎవ్వరినీ పట్టించుకోని, ఎవ్వరి కోసం మారకూడదని భావించే పల్లెటూరి వ్యక్తి కథాంశంతో బచ్చల మల్లి మూవీ ఉంటుందని టీజర్ క్లారిటీ ఇచ్చేసింది. హీరోయిన్ అమృతా అయ్యర్ హీరో జీవితాన్ని ఎలా మార్చిందని పాయింట్ తో సినిమా నడుస్తుందని అర్థమవుతోంది. వారి జీవితంలో ఎదురైన సంఘటనల చుట్టూ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

టీజర్ ప్రకారం.. బచ్చల మల్లి మూవీలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత మాస్ లుక్‌ లో నరేష్ కనిపించనున్నారని అర్థమవుతోంది. ఫుల్ గా గడ్డంతో చాలా ఆయన లుక్ రగ్డ్ గా ఉంది. సినిమాలో పూర్తిగా రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించడమే కాకుండా.. మొండితనం, మూర్ఖత్వం ఉన్న రోల్ లో సినీ ప్రియులను అలరించనున్నట్లు తెలుస్తోంది.

ఓవరాల్ గా టీజర్ సూపర్ గా ఉందని, అల్లరి నరేష్ మరోసారి బచ్చల మల్లిగా అదరగొట్టేందుకు సిద్ధమయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డైలాగ్స్‌ తెగ మెప్పిస్తున్నాయని అంటున్నారు. మందుతో పాటు అప్పుడప్పుడు నాకు అమ్మాయిల అలవాటు కూడా ఉందని నరేష్ చెప్పిన డైలాగ్ క్రేజీగా ఉందని చెబుతున్నారు.

విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్, దర్శకుడు సుబ్బు మంగాదేవి విజన్ తో పాటు ఓవరాల్ టీజర్ కంటెంట్.. సినిమాపై అంచనాలు పెంచుతోందని అంటున్నారు. వేరే లెవెల్ బజ్ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు. మరి క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న బచ్చల మల్లి మూవీ.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    
  • Allarinaresh 
  • Bachhalamalli 
  • AmrithaAiyer 
  • SubbuMangadevvi 
  • RazeshDanda 
  • Teasertalk 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS