• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని.. సరిపోదా పవన్...

నాని.. సరిపోదా పవన్ సైన్యం..

| దసరా తర్వాత ఆ స్థాయి మాస్ ఎలివేషన్ తో నాని నుంచి సరిపోదా శనివారం మూవీ రాబోతోందని ట్రైలర్ తో క్లియర్ అయ్యింది.

By - Tupaki Desk
Update: 2024-08-14 04:34 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కి యుట్యూబ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నానితో అంటే సుందరానికి లాంటి క్లాస్ మూవీ చేసిన వివేక్ ఆత్రేయ ఈ సారి మాత్రం కంప్లీట్ మాస్ ఎలివేషన్ తో పవర్ ఫుల్ స్టోరీతో సరిపోదా శనివారం చిత్రాన్ని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. దసరా తర్వాత ఆ స్థాయి మాస్ ఎలివేషన్ తో నాని నుంచి సరిపోదా శనివారం మూవీ రాబోతోందని ట్రైలర్ తో క్లియర్ అయ్యింది.

వారం రోజులు ఉన్న కోపాన్ని ఒక్క రోజు మాత్రమే చూపించే క్యారెక్టర్ లో నాని ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఎస్.జె.సూర్య ప్రజలని దారుణంగా హింసించే సైకో పోలీస్ గా కనిపిస్తున్నాడు. ఇక యాక్షన్ ఎలిమెంట్స్ చిత్రంలో చాలా హెవీగా ఉన్నాయని అర్ధమవుతోంది. సూర్య మాత్రమే కాకుండా మరో ఇద్దరు విలన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో రివీల్ చేశారు. మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేలా కంటెంట్ ఉండబోతోందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది.

ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మించారు. మూవీ కోసం సోకులపురం అనే ఒక విలేజ్ ని కంప్లీట్ గా నిర్మించారు. దీనికోసమే ఎక్కువ బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. ఆగష్టు 29న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ గట్టిగా దొరికినట్లు అనిపిస్తోంది.

ట్విట్టర్ లో పవర్ స్టార్ అభిమానులు ట్రైలర్ ని షేర్ చేస్తున్నారు. అలాగే నేచురల్ స్టార్ నానికి సరిపోదా శనివారం బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని, ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. నాని ఎలక్షన్స్ లో చేసిన సపోర్ట్ కి అతనికి కృతజ్ఞతగా తిరిగి సక్సెస్ ఇచ్చేయాలి అని కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ కి నాని సపోర్ట్ గా నిలబడ్డారు. ఎలక్షన్స్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలాగే ఓ మూవీ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.

ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులు అందరూ కూడా నానిని కూడా తమవాడిగా ఫీల్ అవుతున్నారు. ఆయన సినిమా రిలీజ్ అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ సైన్యం నుంచి ఫుల్ సపోర్ట్ దొరికినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మించిన డివివి దానయ్య పవన్ కళ్యాణ్ కి మద్దతుదారుడిగా ఉన్నారు. ఓజీ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమాని పవర్ స్టార్ అభిమానులు పైకి లేపడానికి నిర్మాత కూడా ఒక కారణం అనే మాట వినిపిస్తోంది. కాబట్టి సినిమా హిట్టుకు పవన్ సైన్యం సరిపోతుంది అనేలా ఒక వైబ్ కొనసాగుతోంది. మరి బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Nani Elections Ki Ichina Support Trigi icheyaali 🦁Tommorow #SaripodhaaSanivaaramTrailer 🔥pic.twitter.com/N4xYDSqowW

— VK 🕶️ (@GaneshVKPK) August 12, 2024

Repu kummedengutunnam 💥🥵#SaripodhaaSanivaaramTrailer https://t.co/kko5Ajoclt pic.twitter.com/CrUXwTeoH8

— Vamsivardhan PKVK (@Vamsivardhan_2) August 12, 2024
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • SaripodhaaSanivaaram 
  • Nnai 
  • Priyankaarulmohan 
  • Vivekathreya 
  • Pawankalyan 
  • Fans 
  • Tweet 
  • Twitter 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS