• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైర్ 2 రికార్డ్.. నాని...

టైర్ 2 రికార్డ్.. నాని మరోసారి కొట్టాల్సిందే..

| ఇదిలా ఉంటే ఈ సినిమా ముందు ఇప్పుడొక టార్గెట్ ఉంది. నాచురల్ స్టార్ నాని తన దసరా మూవీతో తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 24.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-08-23 04:24 GMT

నాచురల్ స్టార్ నాని వరుస సక్సెస్ లతో జోరు మీద ఉన్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ తో ఇప్పటికే ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మాస్ యాక్షన్ జోనర్ లో సరిపోదా శనివారం మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోందని అర్ధమవుతోంది.

ఎస్.జె.సూర్య లాంటి విలక్షణ నటుడితో నాని ఈ సినిమాలో పోటీ పడుతున్నాడు. ఈ మధ్య ఎస్.జె.సూర్య విలన్ పాత్రలలో నటించిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ అయ్యాయి. ఇండియన్ 2 మాత్రమే ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. తెలుగులో స్పైడర్ తర్వాత సూర్య విలన్ గా నటించిన రెండో సినిమాగా సరిపోదా శనివారం మూవీ రాబోతోంది. ఆగష్టు 29న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ముందు ఇప్పుడొక టార్గెట్ ఉంది. నాచురల్ స్టార్ నాని తన దసరా మూవీతో తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 24.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నాడు. టైర్ 2 హీరోలలో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న హీరోగా నాని దసరాతో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ని వేరే టైర్ 2 హీరోలు ఎవరూ కూడా టచ్ చేయలేకపోయారు. విజయ్ దేవరకొండ ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రెండు దసరా రికార్డ్ దరిదాపుల్లోకి రాలేదు.

రామ్ పోతినేని స్కంద, డబుల్ ఇస్మార్ట్ లతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఈ రికార్డ్ ని టచ్ చేయలేకపోయాడు. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో దసరా ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని తాకలేకపోయాడు. ఇప్పుడు మరల నానికి ఆ అవకాశం వచ్చింది. సరిపోదా శనివారం సినిమాపై ఉన్న హైప్ బట్టి అయితే ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి కావాల్సినంత స్కోప్ ఉంది.

మొదటి రోజు 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటే దసరా రికార్డ్ బ్రేక్ అవుతుంది. మరి ఈ ఫీట్ ని నాని ఎంత వరకు బ్రేక్ చేయగలడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వేళ దసరా కలెక్షన్స్ ని ఫస్ట్ డే పరంగా నాని బ్రేక్ చేస్తే తరువాత టైర్ 2 హీరోలలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న హీరోగా ఉన్న రికార్డ్ ని కూడా నాని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Tags:    
  • Naturalstarnani 
  • Tollywood 
  • Talentedactor 
  • Sjsurya 
  • Priyankaarulmohan 
  • Vivekathreya 
  • Dvvdanayya 
  • Moviecollections 
  • Dasaramovie 
  • Saripodhaasanivaaram 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS