• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని సినిమాలు.. ఈ...

నాని సినిమాలు.. ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

| నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో "సరిపోధా శనివారం" సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-06-01 09:07 GMT

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో "సరిపోధా శనివారం" సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. అంటే..సుందరానికి సినిమా అనంతరం వీరి కలయికలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఇప్పటికే దాదాపు షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇక రెగ్యులర్ ప్రమోషన్స్త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్టు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది.

అయితే, నాని తన తదుపరి చిత్రం విషయంలో ఇటీవల అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మొదట అయితే సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చేయనున్నట్టు ప్రకటించారు. ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సరిపోధా శనివారం DVV దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చారు. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని గాసిప్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో, మరికొందరు నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ ను తీసుకోవడానికి ఆసక్తి చూపించారని కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం కొత్త రూమర్ మరొకటి వైరల్ అవుతోంది, నాని ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించారట. సుజీత్‌కు అనేక ప్రొడ్యూసర్లతో కమిట్‌మెంట్లు ఉండటంతో, ప్రాజెక్ట్‌ పై ప్రతికూలతలు ఎదురయ్యాయని తద్వారా, కొత్త నిర్మాతను ఎంపిక చేసే విషయంలో కన్ఫ్యూజన్ ఉండకుండా, నాని ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు నాని కొన్ని నెలలుగా బలగం వేణుతో రూరల్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చింది. దాని టైటిల్ "ఎల్లమ్మ" అని కూడా గుసగుసలు వినిపించాయి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

కానీ ఫైనల్ కథ వినిపించినప్పుడు నాని సంతృప్తి చెందలేదట. ఫలితంగా, ఈ ప్రాజెక్ట్‌ కూడా నిలిపివేయబడిందని మరొక రకమైన టాక్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం, నాని రెండు సినిమాలను నిలిపివేశారు. త్వరలోనే నాని దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మేగాబడ్జెట్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌లో నిర్మించనున్నారు.

అదనంగా, తమిళ దర్శకుడు TJ గ్నానవేల్‌తో కూడా నాని ఓ చిత్రం గురించి చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది మొదలు కానుంది. ఇక నాని సుజిత్, వేణు లతో చేయాల్సిన రెండు ప్రాజెక్టులు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే నాని నుంచి అఫీషియల్ గా క్లారిటీ రావాల్సిందే.

Tags:    
  • Nani 
  • Tollywood 
  • Filmindustry 
  • Saripodhaasanivaaram 
  • Vivekathreya 
  • Dvvdanayya 
  • venu 
  • Srikanthodela 
  • Sujeeth 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS