• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని 'ఎల్లమ్మ' లెక్క...

నాని 'ఎల్లమ్మ' లెక్క సెట్టయినట్లే..

By - Tupaki Desk
Update: 2024-02-24 16:00 GMT

నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు సరికొత్త తరహా కథలో తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త తరహా క్యారెక్టర్ తో కనిపించాలి అని అతడు సెలెక్ట్ చేసుకుంటున్న కథలు మిగతా నటీనటులకు కూడా ఒక ప్రేరణగా నిలుస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇక నాని లైనఫ్ చూస్తూ ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా వేగంగా సినిమాలను పూర్తి చేస్తున్న బెస్ట్ హీరోల్లో ఒకరని చెప్పుకోవచ్చు.

నాని బలగం దర్శకుడు వేణుతో ఒక సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఆ ప్రాజెక్టు ఉండబోతుంది అని ఇప్పటికే కథ వినిపించిన వేణు ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తర్వాత ప్రాజెక్టుపై అఫీషియల్ క్లారిటీ ఇస్తాడు అని చాలా రోజులుగా కథనాలు వస్తూ ఉన్నాయి. అయితే నేడు నాని పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు వేణు ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడు.

అంతేకాకుండా ఆయనతోపాటు దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా ఉండడంతో ఈ కాంబినేషన్ దాదాపు ఫైనల్ అయిపోయినట్లుగానే క్లారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఇంతకుముందు నాని కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు వేణుతో సినిమా చేయడానికి ఇష్టమే అని ముందుగానే ఒక హింట్ అయితే ఇచ్చాడు.

ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నా ఈ కాంబినేషన్ పై మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. త్వరలోనే సినిమా స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసుకుని దర్శకుడు సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు టైటిల్ పై కూడా ఇదివరకే ఒక టాక్ వచ్చింది. నిర్మాత 'ఎల్లమ్మ' అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించారట.

తెలంగాణ 1980 బ్యాక్ డ్రాప్ లో సినిమా కథ ఉంటుందట. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, కక్ష్యల నేపథ్యంలో దాదాపు బలగం ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు టాక్. అయితే ఒకే తరహాలో ఉండకుండా వేణు ట్రీట్మెంట్ ఈసారి వేరేలా ఉంటుందట. పూర్తిస్థాయిలో తెలంగాణ నేపథ్యం ఇంకా చాలా బలంగా చూపించే అవకాశం ఉన్నట్లు టాక్. ఇక నాని ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ అనంతరం ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.

Tags:    
  • Nani 
  • Naturalstar 
  • Venu 
  • Dilraju 
  • Tollywood 

Similar News

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS