• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పుడు రిజెక్ట్ చేసి.....

అప్పుడు రిజెక్ట్ చేసి.. ఇప్పుడు లైన్ లో పెట్టిన నాని

| నాని- జ్ఞానవేల్‌ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

By - Tupaki Desk
Update: 2024-04-06 07:14 GMT

తన యాక్టింగ్ తో టాలీవుడ్ లో సుదీర్ఘంగా నేచురల్ స్టార్ గా దూసుకుపోతున్నారు యంగ్ హీరో నాని. ఏ మాత్రం కూడా బ్రేక్ ఇవ్వకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. గత ఏడాది మార్చిలో దసరా మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని.. అదే జోష్ తో హాయ నాన్న సినిమా చేశారు. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

 

ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు నాని. ఈమధ్య కాలంలో కంటిన్యూగా సినిమాలు ప్రకటిస్తున్నారు. అంటే సుందరానికి మూవీ తీసిన వివేక్ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం.. ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది.

ఈ మూవీతో పాటు నాని చేతిలో అనేక చిత్రాలు ఉన్నాయి. డీవీవీ బ్యానర్ లో ఓజీ సుజిత్ తో కలిసి వర్క్ చేయనున్నారు నాని. ఇటీవల దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు సినిమాలు 2024 లోనే ప్రారంభం కానున్నాయి. బలగం వేణుతో చేయనున్న ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇటీవల నాని మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌.. కొన్ని రోజుల క్రితం నానికి స్క్రిప్ట్ వినిపించారు. కథ నచ్చి ఫైనల్ స్క్రిప్ట్ పై నాని వర్క్ చేయమన్నారట. ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్న జ్ఞానవేల్‌.. ఫైనల్ స్క్రిప్ట్ ను త్వరలోనే నానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. నాని- జ్ఞానవేల్‌ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం జ్ఞానవేల్.. రజనీకాంత్ తో తలైవర్ 170 సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో అతిథి పాత్రలో నాని నటిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్టు టాక్ వినిపించింది. అయితే ఆ రోల్ నచ్చక నాని సున్నితంగా రిజెక్ట్ చేశారని తర్వాత తెలిసింది. అప్పుడు జ్ఞానవేల్‌ సినిమాలో గెస్ట్ రోల్ కు నో చెప్పిన నాని.. ఇప్పుడు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో!!

Tags:    
  • Naturalstarnani 
  • Gnanavel 
  • Jaibheem 
  • Moviedirector 
  • Thalaivar179 
  • Rajinikanth 
  • Balagamvenu 
  • Saripodhashanivaram 
  • Dvvdannaya 
  • Sujeetkumar 
  • Vivekathreya 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS