• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని 32.. బ్లడీ ఊచకోత

నాని 32.. బ్లడీ ఊచకోత

| టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-09-03 13:16 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది దసరా, హాయ్ నాన్న తో హిట్స్ అందుకున్న ఆయన.. రీసెంట్ గా సరిపోదా శనివారంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో తన యాక్టింగ్ తో వేరే లెవెల్ లో అలరించారు నాని. సూర్య రోల్ లో తనదైన శైలిలో మెప్పించారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

సరిపోదా శనివారం మూవీ టైమ్ ఓవర్.. ఇప్పుడు తన అప్ కమింగ్ చిత్రాలపై దృష్టి పెట్టారు నాని. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తన నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ డేట్ ను రివీల్ చేశారు. నాని 32 అనౌన్స్మెంట్ సెప్టెంబర్ 5వ తేదీన ఉదయం 11:04 గంటలకు రానున్నట్లు తెలిపారు. బ్లడీ ఊచకోత కోసం స్టే టూన్డ్ అని చెప్పారు. 16 years of Nani in TFI అంటూ హష్ ట్యాగ్ ఇచ్చారు. దాంతో పాటు స్పెషల్ పోస్టర్ ను షేర్ చేశారు

ఆ పోస్టర్ ను నాని కూడా ట్వీట్ చేశారు. అందులో వెహికల్ స్టీరింగ్ పై చేయి వేసినట్లు పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ.. అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే నాని 32 పేరుతో ఆయన బర్త్ డే రోజు కూడా అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. చిన్న గ్లింప్స్ కూడా షేర్ చేశారు.

టర్న్ డౌన్ ది వైలెన్స్, టర్న్ అప్ ది మ్యూజిక్ అనే ట్యాగ్ తో స్టార్ట్ అయిన ఆ వీడియో.. పలు క్యాప్షన్లతో ఇంట్రెస్టింగ్ గా సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఫన్నీ యాక్షన్ రైడ్‌ గా మూవీ ఉండబోతున్నట్లు ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ వచ్చింది. "ఇది సుజీత్ సినిమా.. పవర్ తర్వాత… ప్రేమికుడు #Nani32 వస్తాడు" అని నాని కూడా పోస్ట్ చేశారు. హీరోయిన్ సహా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఇప్పుడు నాని 32 కోసం అప్డేట్ వచ్చినా.. అందులో సుజీత్, డీవీవీ.. పేర్లను ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయితే నాని తనకు దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ(Nani 33) చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 5వ తేదీన.. రానున్న అనౌన్స్మెంట్ ఎవరి డైరెక్షన్ లో మూవీ అన్నది తెలియాల్సి ఉంది. సుజీత్ దర్శకత్వంలోనా.. లేక శ్రీకాంత్ దర్శకత్వంలోనా అన్నది వేచి చూడాలి.

Tags:    
  • Nani32 
  • Nani 
  • Naturalstar 
  • Saripodhaasanivaaram 
  • Tollywood 
  • Nani33 
  • Nani32movie 
  • Filmindustry 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS