నాని సినిమా ముందే ఖర్చీఫ్ వేస్తున్న నెట్ ఫ్లిక్స్..?

నాని సినిమా ఐతే చాలు బ్లైండ్ గా వెళ్లొచ్చు అని నెట్ ఫ్లిక్స్ ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే స్వతహాగా స్టార్ గా ఎదిగిన నాని స్టోరీ సెలక్షన్స్ లో ది బెస్ట్ అనిపించుకుంటూ వస్తున్నాడు.;

Update: 2025-12-05 05:12 GMT

న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటే చాలు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ముందే రైట్స్ కొనేస్తుంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ది ప్యారడైజ్ సినిమాకు భారీ డీల్ సెట్ చేసుకుంది నెట్ ఫ్లిక్స్. నాని సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో మంచి వ్యూస్ రాబడుతున్నాయి. అంతేకాదు తన రేంజ్ కి తగిన సినిమాలతో నాని కాన్ స్టంట్ హిట్ మేనియా కొనసాగిస్తున్నాడు. అటు థియేట్రికల్ లో సక్సెస్ సాధిస్తున్న నాని సినిమాలు ఓటీటీ రిలీజ్ తర్వాత డబల్ హిట్ అనిపించుకుంటున్నాయి. ఓటీటీలో రిపీటెడ్ గా చూసేలా నాని సినిమాల కంటెంట్ ఉంటున్నాయి. అందుకే నాని సినిమాలను మిగతా ఓటీటీలు పోటీకి రాకముందే నెట్ ఫ్లిక్స్ ఖర్చీఫ్ వేస్తుంది.

నాని సుజీత్ సినిమా రైట్స్..

ఈ క్రమంలో ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది నెట్ ఫ్లిక్స్. ఐతే ప్యారడైజ్ మాత్రమే కాదు నెక్స్ట్ నాని చేయబోతున్న సుజీత్ సినిమా రైట్స్ కి కూడా నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ ముందు ఉంచిందట. పవర్ స్టార్ తో ఓజీ సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు సుజీత్. అతనితో నాని సినిమా చేయడం ఓ విధంగా ఈ కాంబో క్రేజీగా మారింది. ఐతే ఈ సినిమా జస్ట్ పూజా కార్యక్రమాలు మాత్రమే అయ్యాయి. సెట్స్ మీదకు వెళ్లని ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.

నాని సినిమా ఐతే చాలు బ్లైండ్ గా వెళ్లొచ్చు అని నెట్ ఫ్లిక్స్ ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే స్వతహాగా స్టార్ గా ఎదిగిన నాని స్టోరీ సెలక్షన్స్ లో ది బెస్ట్ అనిపించుకుంటూ వస్తున్నాడు. దసరా ముందు వరకు నాని మాస్ సినిమాలు చేయలేడు అనుకున్నారు. కానీ దసరాతో ఊర మాస్ యాంగిల్ తో సూపర్ హిట్ కొట్టాడు. దసరా తర్వాత నాని సినిమాలు చూసే కోణం కూడా మారింది. ఆల్ రౌండర్ గా నాని చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సందడి చేస్తున్నాయి.

అనౌన్స్ మెంట్ రావడమే ఆలస్యం డిజిటల్ రైట్స్ డీల్ సెట్..

అందుకే నెట్ ఫ్లిక్స్ కూడా నాని సినిమా అంటే చాలు అనౌన్స్ మెంట్ రావడమే ఆలస్యం డిజిటల్ రైట్స్ డీల్ సెట్ చేసుకుంటుంది. సుజీత్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సుజీత్ నాని కాంబినేషన్ సినిమాకు మొన్నటిదాకా బ్లడీ రోమియో టైటిల్ ప్రచారంలో ఉండగా లేటెస్ట్ గా గన్స్ అండ్ రోజెస్ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

ఈమధ్య పెద్ద సినిమాలకు సైతం ఓటీటీ రైట్స్ సేల్ అవ్వక నిర్మాతలు, ఓటీటీ సంస్థల మధ్య దూరం పెరుగుతుంది. ఐతే హీరోల ఇమేజ్ లు కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నా అసలు నాని సినిమాలు ఇలా సెట్స్ మీద ఉండగానే డిజిటల్ రైట్స్ సేల్ అవ్వడం నాని స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాయి. న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో సూపర్ హ్యాపీగా ఉన్నారు.

Tags:    

Similar News