ది ప్యారడైజ్.. అనుకోకుండా ఇంత పెద్దదైందా?

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.

Update: 2026-09-15 12:30 GMT

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. భారీ యాక్షన్, ప్రత్యేకమైన కథా నేపథ్యం, నాని మాస్ అవతార్‌తో ఇప్పటికే ఈ సినిమా డిస్క‌ష‌న్స్ లో ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా కామెంట్స్ చూస్తే.. ది ప్యారడైజ్ మొదట అనుకున్న స్థాయిలోనే ఆగిపోలేదని, కథను డెవలప్ చేసే కొద్దీ దాని పరిధి ఊహించని స్థాయికి పెరిగిందని అర్థమవుతోంది. ఒక సాధారణ ఆలోచనగా మొదలైన కథ క్రమంగా భారీ స్కేల్ ఉన్న సినిమాగా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది.

డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల త‌న‌కొచ్చిన ఆలోచనతో మొదట సినిమా చేయాలన్న ఉద్దేశం మాత్రమే ఉందట. కానీ కథలోకి మరింత లోతుగా వెళ్లే కొద్దీ దాని విస్తృతి తనకే అర్థమైందని చెప్పారు. ఓ దశలో ఇది రెగ్యుల‌ర్ సినిమా కాదనే విషయం అర్థ‌మైంద‌ని, ఆ తర్వాత కథను మరింత జాగ్రత్తగా, భారీ స్థాయిలో తెరకెక్కించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన చెప్పారు. అందుకే సినిమా షూటింగ్ కు ముందే రెండేళ్ల సమయాన్ని పూర్తిగా ఈ ప్రాజెక్ట్‌కే కేటాయించాలని డిసైడ్ అయిన‌ట్టు తెలిపారు. కథ పెరిగే కొద్దీ మేకింగ్ కూడా అదే స్థాయిలో విస్తరించినట్లు శ్రీకాంత్ తెలిపారు.

ఇక ది ప్యారడైజ్ కు మరో ఇంట్రెస్టింగ్ అంశం దాని ప్రమోషనల్ స్ట్రాటజీ. ఇప్పటివరకు పెద్దగా కంటెంట్‌ను బయటకు తీసుకురాకపోయినా సినిమాపై హైప్ మాత్రం తగ్గలేదు. కేవలం రెండు పాటలు, టీజర్లతోనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్న రాఘవ్ జుయల్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సాధారణంగా భారీ సినిమాలకు వరుస అప్‌డేట్స్, గ్లింప్స్, ట్రైలర్స్‌తో హైప్‌ను పెంచాల్సి ఉంటుంది. కానీ ది ప్యారడైజ్ విషయంలో తక్కువ కంటెంట్‌తోనే ఆసక్తి కొనసాగుతుండటం మేకర్స్‌కు కలిసొచ్చే అంశంగా మారింది.

మరోవైపు సినిమా చెప్పిన టైమ్ కు రాకుండా ఆలస్య‌మ‌వ‌డం, నెగిటివ్ కామెంట్స్ వంటి అంశాలు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఇంపాక్ట్ చూపలేకపోయాయ‌ని డైరెక్ట‌ర్ చెప్పారు. సినిమా విషయంలో ఏది జరగాల్సి ఉందో అది సరైన టైమ్ లోనే జరుగుతూ వ‌చ్చింద‌ని అందుకే ది ప్యార‌డైజ్ రిలీజ్ లేటైనా, నెగిటివిటీ వచ్చినా సినిమాపై హైప్ మాత్రం క్రమంగా పెరుగుతోందని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తంగా చూస్తే.. మొదట సాధారణ ఆలోచనగా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు భారీ అంచనాల సినిమాగా మారడమే కాకుండా, తక్కువ ప్రమోషనల్ కంటెంట్‌తోనే ఆడియ‌న్స్ లో భారీ ఇంట్రెస్ట్ ను సంపాదించుకున్న ప్రాజెక్ట్‌గా మారింది.

Tags:    

Similar News