‘ఆయా షేర్’ తర్వాత.. ఏం ప్లాన్ చేశారయ్యా

అనిరుధ్ మ్యూజిక్, కాసర్ల శ్యామ్ లిరిక్స్ కూడా పాటను జనాల్లోకి తీసుకెళ్లాయి. ఇప్పుడు రెండో సింగిల్ దగ్గరకు వచ్చేసరికి అదే టీమ్ నుంచి మరో చిన్న హింట్ బయటకు వచ్చింది.

Update: 2026-08-27 17:30 GMT

నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ వచ్చిన ‘ఆయా షేర్’ పాట తన పని చేసేసింది. సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని పూర్తిగా చెప్పకుండానే, నాని పాత్రను ఒక రేంజ్‌లో పరిచయం చేశారు. అనిరుధ్ మ్యూజిక్, కాసర్ల శ్యామ్ లిరిక్స్ కూడా పాటను జనాల్లోకి తీసుకెళ్లాయి. ఇప్పుడు రెండో సింగిల్ దగ్గరకు వచ్చేసరికి అదే టీమ్ నుంచి మరో చిన్న హింట్ బయటకు వచ్చింది.

ఈసారి కాసర్ల శ్యామ్ ముందుగా ఓ క్లారిటీ ఇచ్చాడు. రెండో పాట ఫైనల్ అవుట్‌పుట్ విన్న తర్వాత “DJ Anirudh bolthe.. Lit K Ramp” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అనిరుధ్, నాని, శ్రీకాంత్ ఓదెలతో పాటు ‘ది ప్యారడైజ్’ టీమ్‌ను ట్యాగ్ చేశాడు. పాట పేరు కానీ, ట్యూన్ ఎలా ఉంటుందనే విషయం కానీ చెప్పలేదు. కానీ ఫైనల్ వెర్షన్ రెడీ అయిందనే విషయం మాత్రం ఈ పోస్ట్‌తో బయటకు వచ్చింది.

ఇక్కడ మేకర్స్ ఎలాంటి పాటను ఎంచుకున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది‘ఆయా షేర్’ను రెగ్యులర్ సినిమా పాటలా వదలకుండా, నాని పాత్ర జడల్ ప్రపంచాన్ని ముందుగా పరిచయం చేసేలా తీసుకొచ్చారు. అందుకే రెండో పాట కూడా కథలో ఏ భాగాన్ని ముందుకు తీసుకొస్తుందన్నది తెలియాల్సి ఉంది.

పైగా ఈ పాటకు కూడా కాసర్ల శ్యామ్ పనిచేయడం మరో కామన్ పాయింట్. ‘ఆయా షేర్’లో ఆయన వాడిన పదాలు, అనిరుధ్ ఇచ్చిన బీట్ కలిసి ప్రత్యేకమైన స్టైల్‌లో వెళ్లాయి. ఇప్పుడు అదే ఇద్దరూ మరోసారి కలవడంతో మొదటి పాట తరహాలోనే వెళ్తారా, లేక పూర్తిగా మరో టోన్ పట్టుకుంటారా అన్నది పాట వచ్చాకే తెలుస్తుంది.

‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’ ప్రతి అప్డేట్‌ను మేకర్స్ కాస్త ప్లాన్‌తోనే బయటకు తీసుకొస్తున్నారు. ఒకేసారి ఎక్కువ విషయాలు చెప్పకుండా, ముందు నాని లుక్, తర్వాత ‘ఆయా షేర్’, ఇప్పుడు రెండో సింగిల్ అంటూ ఒక్కోటి బయటకు వస్తోంది.

ప్రస్తుతం రెండో పాటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా చెప్పలేదు. అయితే ఫైనల్ అవుట్‌పుట్ వరకు పని వచ్చేసిందని కాసర్ల శ్యామ్ పోస్ట్‌తో క్లియర్ అయింది. ‘ఆయా షేర్’తో మొదటి పాటను ఒక రూట్‌లో తీసుకెళ్లిన టీమ్, ఇప్పుడు రెండో పాట కోసం ఏం ప్లాన్ చేసిందన్నదే నెక్స్ట్.

Tags:    

Similar News